/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t112957022-2025-11-20-11-31-24.jpg)
Hidma's follower in police custody..Operation "Sagar Kavach" for Maoists
Operation "Sagar Kavach": మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతిపై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన రక్షణ దళ సభ్యులతో కలిసి ఏపీ ఏజెన్సీలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందుగా కొంతమంది సాయుధులు ఏపీలోని కొన్ని ప్రాంతాలకు చేరుకుని షెల్టర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం షెల్టర్ తీసుకున్న తర్వాత తిరిగి దండకారణ్యం లేదా ఓడిస్సాలోకి ప్రవేశించాలని హిడ్మా బృందం భావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ముందుగానే లీక్ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిడ్మా అనుచరులను ముందుగానే అదుపులోకి తీసుకుని హిడ్మా ఆచూకీ కనిపెట్టినట్లు తెలుస్తోంది. లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఆయన ఎన్ కౌంటర్ అయినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే పలువురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టగా వారికి కోర్టు రిమాండ్ విధించింది. అదే సమయంలో కోనసీమ జిల్లాలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిగా భావిస్తున్న మడివి సరోజ్‌ను పోలీసులు రావులపాలెంలో అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. అతడిని అరెస్ట్ చేసి, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. మారేడుమిల్లి సమీపంలో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హిడ్మా అనుచరుడిగా ఉన్న మడివి సరోజ్ రావులపాలెంలో తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు అతడిని గుర్తించి అరెస్ట్ చేశాయి.
అరెస్టయిన మడివి సరోజ్ స్వస్థలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక గ్రామంగా గుర్తించారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ తర్వాత ఏజెన్సీ నుంచి తప్పించుకుని కోనసీమ ప్రాంతానికి వచ్చాడా? లేక మరేదైనా కారణంతో ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అరెస్ట్‌తో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి మావోయిస్టుల కదలికలపై చర్చ మొదలైంది. సఖినేటిపల్లిలో ఒక చేపల చెరువులో సరోజ్ పనికి కుదిరినట్లు సమాచారం. అతడి నుంచి తుపాకీతో పాటు పది తూటాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఛత్తీష్ గఢ్ నుంచి భారీ సంఖ్యలో మావోయిస్టులు ఏపీ బార్డర్‌లోకి తరలివచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడిన హిడ్మా సన్నిహితుడు సరోజ్ మండ్వి కీలక విషయాలు లీక్ చేసినట్లు సమచారం. దీంతో మావోయిస్టుల కదలికలపై పోలీసుల డేగ కన్ను వేశారు. గోదావరి జిల్లాలే టార్గెట్‌గా ఛత్తీస్ గడ్, ఒరిస్సా నుంచి ఆక్వా చెరువుల వద్దకు వలస వచ్చిన వారిపై నిఘా పెడుతున్నారు. సాగర్ కవచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
Also Read: ఖమ్మం గట్టయ్య సెంటర్‌లో దారుణం.. ఉదయాన్నే భార్య గొంతు కోసి.. పిల్లలను నరికి..!
హిడ్మా సన్నిహితుడు సరోజ్ మండ్వి హిడ్మా రక్షణ దళంలో అత్యంత కీలక సభ్యునిగా వ్యవహారించారు.హిడ్మా తో ఛత్తీస్ గడ్ లో పలు ఎన్కౌంటర్ లలో సరోజ్ మండ్వి పాల్గొన్నాడు. సరోజ్ మండ్వి గత కొన్ని రోజులుగా సఖినేటిపల్లి సమీపంలో ఆక్వా చెరువు వద్ద పనిచేస్తున్నాడు. ఛత్తీస్ గడ్ సుక్మా జిల్లాకు చెందిన సరోజ్ మండ్వి...రావులపాలెంలో సరోజ్ మండ్విను అదుపులోకి తీసుకున్నారు. గోదావరి జిల్లాల్లో మావోయిస్టుల కదలికలపై పోలీసుల డేగ కన్నువేశారు.గోదావరి జిల్లాలే టార్గెట్ గా ఇక్కడికి మావోయిస్టులు వచ్చారా.....??? అనే అనుమానం బలపడుతోంది.ఛత్తీస్ గడ్, ఒరిస్సా నుంచి ఆక్వా చెరువుల వద్దకు వలస వచ్చిన వారిపై నిఘా పెడుతున్న పోలీసులు . అందులో భాగగగోదావరి జిల్లాల తీరంలో సాగర్ కవచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నరు.
Follow Us