CBSC ఆకస్మిక తనిఖీలు.. దొరికిన డమ్మీ స్టూడెంట్స్

దేశంలోని పలు స్కూళ్లలో డమ్మీ విద్యార్థులను గుర్తించేందుకు సీబీఎస్‌ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. చాలా స్కూళ్లలో వాస్తవ హాజరు రికార్డులకు మించి విద్యార్థులను ఎన్‌రోల్‌ చేయడంతో రూల్స్‌ను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
CBSC 2

సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSC) దేశంలోని పలు స్కూళ్లలో డమ్మీ విద్యార్థులను గుర్తించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. బుధవారం, గురువారం బెంగళూరు, ఢిల్లీ, వారణాసి, గుజరాత్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లో 29 స్కూళ్లలో ఈ తనిఖీలు చేపట్టింది.  అయితే ఈ అంశంపై CBSC కార్యదర్శి హమాన్షు మాట్లాడారు. సీబీఎస్‌ఈ అధికారి, అనుబంధ పాఠశాల ప్రిన్సిపాల్‌తో కూడిన 29 టీమ్‌లు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయని అన్నారు.   

Also Read: నాతో రాహుల్ గాంధీ అసభ్యంగా ప్రవర్తించారు.. మహిళా ఎంపీ ఆరోపణలు!

చాలా స్కూళ్లలో వాస్తవ హాజరు రికార్డులకు మించి విద్యార్థులను ఎన్‌రోల్‌ చేయడం వల్ల బోర్డు రూల్స్‌ను వాళ్లు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. మౌలిక సదుపాయల కల్పన విషయంలో కూడా అనేక ఉల్లంఘనలు చోటుచేసున్నట్లు చెప్పారు. రూల్స్ పాటించకపోవడంపై సీబీఎస్‌ఈ బోర్డు తీవ్రంగా పరిగణించిందని.. ఆయా పాఠశాలలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోందని పేర్కొన్నారు. చట్టపరంగా తీసుకునే చర్యలపై కూడా పరిశీలన చేస్తున్నామని చెప్పారు.    

Also Read: ముంబయ్ మారణహోమం నిందితుడి పిటిషన్ కొట్టేయాలని కోరిన అమెరికా

ఇక బోర్డు రూల్స్‌ ఉల్లంఘించిన స్కూళ్లలో ఢిల్లీలోనే 18 ఉన్నాయని తెలిపారు. అలాగే వారణాసిలో మూడు, బెంగళూరు, అహ్మదాబాద్, బిలాస్‌పుర్‌, పట్నాలో రెండు చొప్పున ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజినీరింగ్, మెడిసన్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే చాలామంది విద్యార్థులు ఇలాంటి డమ్మీ సీబీఎస్‌ఈ స్కూళ్ల వైపు చూస్తుంటారన్నారు. వీళ్లు క్రమంతప్పకుడా తరగతుకు హాజరుకాకుండా.. నేరుగా బోర్డు పరీక్షలకే హాజరవుతారని చెప్పారు. విద్యార్థుల దృష్టి మొత్తం స్కూళ్లపై కాకుండా పోటీ పరీక్షలపై దృష్టి పెట్టేలా ఇలాంటి స్కూళ్లు విద్యార్థులకు అవకాశం కల్పిస్తుంటాయని పేర్కొన్నారు. 

Also Read: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు

Also Read: అంబేడ్కర్ Vs దేవుడు.. అమిత్‌షాపై దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు

 

Advertisment
Advertisment