CHAT GPT: వాట్సప్‌లోనూ ఇకపై చాట్ జీపీటీ

వాట్సాప్లోనూ ఛాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చింది. 12 డేస్‌ ఆఫ్‌ ఓపెన్‌ఏఐ అనౌన్స్‌మెంట్స్‌లో భాగంగా తన ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీని వాట్సప్‌లో ప్రవేశపెట్టింది. వేరే యాప్‌, అకౌంట్‌తో సంబంధం లేకుండా వాట్సప్‌లోనే చాట్‌జీపీటీని వినియోగించొచ్చు. 

New Update
WA

చాట్ జీపీటీను ఉపయోగించుకోవాఆ...మీకు అకౌంట్ లేదని వర్రీ అవుతున్నారా...ఏం పర్లేదు మీలాంటి వారిక కోసమే వాట్సాప్‌లో చాట్ బాట్..చాట్ జీపీటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్‌లో నేరుగా చాట్ జీపీటీని ఇక మీదట ఉపయోగించుకోవచ్చును. ప్రపంచ వ్యాప్తంగా ఈ సేపవలు అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్‌లో మనం అడిగిన ఏప్రశ్నకైనా చాట్ జీపీటీ సమాధానం ఇస్తుంది. అయితే దానికి +18002428478 ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.  ఈ నంబర్‌తో వాట్సప్‌లో చాట్‌ చేయొచ్చు. ఇదే నంబర్‌కు కాల్‌ చేసి కూడా చాట్‌జీపీటీ సేవలు పొందొచ్చు. అయితే ఇప్పటికి ఇది అమెరికా, కెనడాల్లో మాత్రమే యూజ్ అఉతోంది. ఇక్కడ టెస్టింగ్ కోసమని ముందు ప్రవేశ పెట్టారు. త్వరలో భారత్‌తో సహ ప్రపంచం అంతా తీసుకురానున్నారు. 

 

వాడుకపై పరిమితి..

వాట్సాప్‌లో చాట్ జీపీటీకి ప్రత్యేకంగా అయితే అకౌంట్ అవసరం లేదు. కానీ రోజు వారీ వాడుకపై మాత్రం పరిమితి ఉంటుంది. పరిమితి అయిపోయినా, లేదా దగ్గర పడ్డా ముందే నోటిఫికేషన్ ఇస్తుంది. భవిష్యత్‌లో చాట్‌జీపీటీ సెర్చ్‌, ఇమేజ్‌ బేస్డ్‌ ఇంటరాక్షన్‌, కన్వర్జేషన్‌ మెమొరీ లాగ్స్‌ వంటి సదుపాయాలు కూడా తీసుకురానున్నారు. మెటా సంస్థ సైతం వాట్సప్‌లో ఏఐ చాట్‌బాట్‌ సేవలను అందిస్తోంది. దానికి పోటీగా చాట్‌జీపీటీని మరింత మందికి చేరువ చేసేందుకు వాట్సప్‌లో సేవలకు ఓపెన్‌ఏఐ ప్రయత్నిస్తోంది. 

Also Read: GAZA: గాజాలో దాడులు ఆపని ఇజ్రాయెల్...తాగునీరే ఆయుధంగా..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు