BREAKING: ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్పై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్పై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‌ను 174కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్పై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‌ను 174కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు.. వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రిషికొండలో రూ.500 కోట్లతో భవనాలు కడతావా? ప్రజాధనాన్ని నీ విలాసం కోసం వినియోగిస్తావా అంటూ నిలదీశారు. జగన్‌పై కేసులు రీఓపెన్ చేస్తా. సిద్ధమా? అంటూ సవాలు చేశారు.
AP: వరద బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. వారిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. వరద బాధిత కుటుంబాలకు రూ.3 వేలు తక్షణ సాయం అందిస్తామన్నారు. అధికారులు పంట నష్టం వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
AP: తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తాను ప్రత్యక్షంగా కోర్టుకు వచ్చి వాదనలు వినిపిస్తానని.. విచారణ వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరగా.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఇండి కూటమిలో వైసీపీ చేరుతుందని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు మాజీ సీఎం జగన్. తాము ఇండి కూటమిలో చేరడం లేదని తేల్చి చెప్పారు. ఇండి కూటమిలో వైసీపీ చేరుతుందనేది తప్పుడు ప్రచారం అని ఆ వార్తలను ఖండించారు.
AP: ఢిల్లీలో జగన్ ధర్నాపై మాజీ మంత్రి యనమల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండి కూటమిలో చేరేందుకు జగన్ సిద్ధమయ్యారని అన్నారు. అందుకోసమే ఇండి కూటమి నేతలు కూడా జగన్‌కు మద్దతు ఇచ్చారని చెప్పారు.
AP: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలకు కౌంటర్ ఇచ్చారు జగన్. కుట్రలో భాగంగానే చంద్రబాబు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఏపీ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే పలు శాఖలపై శ్వేతపత్రాలను చంద్రబాబు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు ఈ శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
మరోసారి బెంగళూరు వెళ్లనున్నారు మాజీ సీఎం జగన్. వినుకొండలో హత్య జరగడంతో హుటాహుటిన బెంగుళూరు నుండి అమరావతి వచ్చిన జగన్... ఈరోజు సాయంత్రం 4గంటలకు ప్రత్యేక విమానంలో సతీమణి భారతితో కలిసి బెంగళూరు వెళ్లనున్నారు. వారం రోజులపాటు బెంగళూరులోనే ఉండనున్నట్లు సమాచారం.