AP: హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే.. రాజకీయ కక్ష, అధికార ప్రోద్బలంతోనే.. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ కక్ష, అధికార ప్రోద్బలంతోనే.. తనను అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. By Jyoshna Sappogula 05 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Pinnelli Ramakrishna Reddy: వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సమయంలో ప్రవర్తించిన తీరు రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈవీఎం ధ్వంసం, అడ్డుకున్న కారంపూడి సీఐపై దాడి చేశారు. ఈ కేసు నేపధ్యంలో ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. Also Read: ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది భక్తుల దుర్మరణం! అయితే, తాజాగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి, పోలింగ్ తర్వాత కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి కేసులలో బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. Also Read: ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది భక్తుల దుర్మరణం! కోర్టు షరతులకు లోబడి ఉంటానని.. బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ కక్ష, అధికార ప్రోద్బలంతోనే.. తనను అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే పిన్నెల్లి బెయిల్ పిటిషన్ను గుంటూరు కోర్టు రెండుసార్లు తిరస్కరించింది. దాదాపు 40 రోజులుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. #pinnelli-ramakrishna-reddy #evm-breaking-issue #ap-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి