ఏపీలో కొత్త వైరస్ కలకలం.. గుంటూర్‌లో తొలి మరణం

ఆంధ్రప్రదేశ్‌లో గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ సోకి తొలి మరణం సంభవించింది. గుంటుర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కమలమ్మ జీబీఎస్ వైరస్ బారిన పడి ఆదివారం చనిపోయింది. ప్రకాశం జిల్లా కోమరఓలు మండలం ఆలసందపల్లి గ్రామస్తురాలు కమలమ్మ 10 రోజులుగా చికిత్స తీసుకుంది.

New Update
Guillain Barre syndrome virus

Guillain Barre syndrome virus Photograph: (Guillain Barre syndrome virus)

ఆంధ్ర ప్రదేశ్‌లో తొలి గులియన్ బారే సిండ్రోమ్ మరణం నమోదైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గుంటురు గవర్నమెంట్ హాస్పిటల్‌లో కమలమ్మ అనే మహిళ ఈ గులియన్ బారే సిండ్రోమ్ బారిన పడి ఆదివారం చనిపోయింది. 10 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె ఆదివారం చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు. ఆమెది ప్రకాశం జిల్లా కోమరఓలు మండలం ఆలసందపల్లి గ్రామస్తురాలు. తీవ్ర జ్వరం, కాల్లు చచ్చుబడిపోయి, ఇతర లక్షణాలతో ఫిబ్రవరి 3న గుంటురు గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేరింది.

Also Read: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. శవాలతో రెండ్రోజులు ఉన్న వృద్ధురాలు

టెస్టులు చేసిన వైద్యులు ఆమెకు జీబీఎస్ వైరస్ సోకినట్లు చెప్పారు. రెండు రోజులుగా లక్షణాలు తీవ్రత ఎక్కవైంది. వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ ఆమె మరణించింది. ఈ వ్యాధితో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రమదకరమైన వైరస్ కానప్పటికీ వ్యాధి ముదిగితే ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. గత నెలరోజు క్రితం ముంబై, పూణేలో కూడా 170 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. మహారాష్ట్రాలో గులియన్ బారే సిండ్రోమ్ వైసర్ సోకి 8 మంది చనిపోయారు. ఈ వ్యాధి ప్రధానంగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది. క్రమక్రమంగా మనిషిని క్షీణింపచేస్తోంది.

Also Read: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు