Guntur Sisters : వారేవా.. అదరగొట్టారు..  గ్రూప్‌-1తో అక్క.. గ్రూప్‌-2తో చెల్లి

ఆ ఇంట్లో పట్టుదల అనేది పాతుకుపోయింది. కృషి కిరీటమై నిలిచింది. ఒకరు పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి గ్రూప్-1లో సత్తా చాటితే.. మరొకరు తొలి ప్రయత్నంలోనే గ్రూప్-2 విజేతగా నిలిచారు.

New Update
guntur sisters

ఆ ఇంట్లో పట్టుదల అనేది పాతుకుపోయింది. కృషి కిరీటమై నిలిచింది. ఒకరు పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి గ్రూప్-1లో సత్తా చాటితే.. మరొకరు తొలి ప్రయత్నంలోనే గ్రూప్-2 విజేతగా నిలిచారు. గుంటూరు(guntur) కు చెందిన అక్కాచెల్లెళ్లు ప్రియాంక, సాహితి కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై తమ తల్లిదండ్రులకు మర్చిపోలేని కానుకను అందించారు.

Also Read :  టీటీడీ ఈవో 'డైరెక్షన్'లోనే కల్తీనెయ్యి స్కామ్ ?

అసాధారణ విజయం

అక్క ప్రియాంకది అసాధారణ విజయం అనే చెప్పాలి.  ఇంజినీరింగ్ పూర్తి చేసి టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా, చిన్ననాటి ఐఏఎస్ కల ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. ఉద్యోగాన్ని వదిలి సివిల్స్, గ్రూప్స్ వైపు అడుగులు వేశారు. ఎక్కడా ఎలాంటి ట్రైనింగ్ తీసుకోకుండా, రోజుకు 15 గంటల పాటు శ్రమిస్తూ సొంతంగా నోట్స్ సిద్ధం చేసుకున్నారు. గతంలో రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లి విఫలమైనా కుంగిపోలేదు. 2024 ప్రిలిమ్స్, 2025 మెయిన్స్ రాసి, చివరకు గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్ హోదాను దక్కించుకున్నారు.

చెల్లి సాహితి లక్ష్యం కూడా ఐఏఎస్ కావడమే. అందుకే పక్కా ప్లానింగ్‌తో డిగ్రీలో బీఏ గ్రూపు తీసుకుని ఢిల్లీలో చదువుకున్నారు. సివిల్స్ ప్రిపరేషన్‌ను గ్రూప్-2కు మళ్లించి, మొదటి ప్రయత్నంలోనే రోడ్లు భవనాల శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ ఉద్యోగంలో చేరుతూనే, ఐఏఎస్ సాధించే వరకు తన పోరాటం ఆపనని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. - Guntur Sisters

వీరి తండ్రి చంద్రుడు వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసి రిటైర్ కాగా, తల్లి స్వర్ణలలిత కర్నూలు జిల్లా నందికొట్కూరులో కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. ఇంట్లో తండ్రిని చూస్తూ పెరిగిన ఈ సోదరీమణులు, ఇప్పుడు తాము కూడా ఉన్నత స్థాయి అధికారులై తండ్రికి తగ్గ తనయలనిపించుకున్నారు. మొత్తానికి ఒకే ఇంట్లో రెండు పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో గుంటూరులో ఈ అక్కాచెల్లెళ్ల గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు.

Also Read :  తిరుమలలో ప్రీవెడ్డింగ్ షూట్‌లో రొమాన్స్.. మండిపడుతున్న భక్తులు

Advertisment
తాజా కథనాలు