AP FIRE ACCIDENT: భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన పసికందులు..!

ఏపీలోని ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బైరావపట్నం వద్ద నివసిస్తున్న సంచార జాతులకు చెందిన దాదాపు పది గుడిసెలు దగ్ధం అయ్యాయి. చంటి పిల్లవాడికి పాలు కాద్దామని గ్యాస్ స్టవ్ అంటించగా అకస్మాత్తుగా మంటలు ఎగసిపడినట్లు తెలుస్తోంది. 

New Update
Eluru Fire Accident.

Eluru Fire Accident

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బైరావపట్నం వద్ద నివసిస్తున్న సంచార జాతులకు చెందిన దాదాపు పది గుడిసెలు దగ్ధం అయ్యాయి. చంటి పిల్లవాడికి పాలు కాద్దామని గ్యాస్ స్టవ్ అంటించగా అకస్మాత్తుగా మంటలు ఎగసిపడినట్లు తెలుస్తోంది. 

Also Read: మేడ్చల్ యువతి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..

20 కుటుంబాలు పరుగులు

బైరావపట్నం వద్ద పది గుడిసెలు 21 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని 20 కుటుంబాలు పరుగులు తీశాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమించటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read: అమెరికాలోనే చరిత్రలోనే అతి పెద్ద ఏరివేత..వైట్ హౌస్

వీరి వద్ద నాటు తుపాకీలో వాడే మందు గుండు సామాగ్రి ఉండటం వలన మంటలు క్షణాల్లో వ్యాపించినట్లు తెలుస్తోంది. కాగా వీరు ఇతర రాష్ట్రాల నుండి బతుకుతెరువు కోసం మండవల్లి మండలం బైరవపట్నం వచ్చారు. అక్కడ చేపల చెరువుల పై పక్షులను వేటాడి జీవనం సాగిస్తున్నారు. 

శుక్రవారం మరికొన్ని ఘటనలు

నిన్న (శుక్రవారం) హైదరాబాద్‌లోని మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కార్ల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అది మరువక ముందే హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం

Also Read: KCR Sister Dead: కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం..

నిజాంపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. టిఫిన్ సెంటర్లో గ్యాస్ వెలిగించే క్రమంలో ఒక్క సారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ - నిజాంపేట్ ఫిట్‌నెస్ స్టూడియో సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. టిఫిన్ సెంటర్లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అలాగే పక్కనే ఉన్న మరో మూడు షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడున్నవారంతా హుటాహుటిన బయటకు పరుగులు తీశారు. అనంతరం సమీప స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Advertisment
తాజా కథనాలు