KCR Sister Dead: కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం..

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేసీఆర్ 5వ సోదరి చీటీ సకలమ్మ గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

New Update
KCR Sister Dead

KCR Sister Dead

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేసీఆర్ 5వ సోదరి చీటీ సకలమ్మ గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఒక హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ పొందుతోంది.

Also Read: మేడ్చల్ యువతి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..

కేసీఆర్‌ దిగ్భ్రాంతి

చివరికి ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కేసీఆర్‌ దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీంతో కేసీఆర్ ఫ్యామిలీ విషాదంలో మునిగింది. ఇక సకలమ్మ అంత్యక్రియలకు కేసీఆర్‌, ఆయన భార్య శోభ, కుమారుడు కేటీఆర్‌, కోడలు శోభ, కుమార్తె కవిత, మేనల్లుడు హరీశ్‌ రావు తదితరులు హాజరయ్యే ఛాన్స్ ఉంది.

Also Read: అమెరికాలోనే చరిత్రలోనే అతి పెద్ద ఏరివేత..వైట్ హౌస్

కేసీఆర్ తన అక్కలతో ఎంతో ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. రాఖీ పండగ రోజు వారంతా వచ్చి రాఖీ కట్టేవారు. అలాంటి వారిలో తన ఐదో సోదరి మృతితో కేసీఆర్ బావోధ్వేగానికి గురయ్యారు. 

కాగా కేసీఆర్‌ది చాలా పెద్ద కుటుంబం. ఆయనకు మొత్తం 8 మంది అక్కలు, ఒక అన్నయ్య, ఒక చెల్లెలు ఉంది. వీరిలో ఇప్పటికే కొందరు కాలం చెల్లారు. 2018 ఫిబ్రవరి 21న కేసీఆర్‌ రెండో అక్క విమల బాయి కన్నుమూశారు. ఆమె 82 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. అలాగే మరో సోదరి లీలమ్మ కన్నుమూసిన విషయం తెలిసిందే. 

Advertisment
తాజా కథనాలు