/rtv/media/media_files/2025/06/22/former-cm-jagans-house-attacked-2025-06-22-18-14-34.jpg)
Former CM Jagans house attacked
Former CM Jagan : గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇంటిపై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. కొంతమంది వ్యక్తులు కారులో వెలుతూ జగన్ ఇంటివైపు తాటికాయలు విసరడంతో కలకలం రేగింది. కాగా ఆ సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై కారును ఫోటో తీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్‌కు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం ఆయనకు సరైన భద్రత కల్పించడం లేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త ఆత్మహత్యాయత్నం
జగన్ ఇంటి వద్ద, ఆయన పర్యటన సమయంలోనూ భద్రత కల్పించడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ ఇంటి దగ్గర కూడా తూతూమంత్రపు భద్రతే ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో కొందరు దుండగులు శనివారం సాయంత్రం కారులో వచ్చి తాటికాయలు విసిరేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీస స్పందన కూడా కనిపించ లేదు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ ఇచ్చినా తాడేపల్లి పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
వైఎస్ జగన్ వాహనానికి ముందు రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ పార్టీలు కనిపించడం లేదు. అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భద్రత కల్పించకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సరైన రక్షణ కల్పించటం లేదని వారు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలో వాపు ఉన్నట్లే.. అప్రమత్తంగా ఉండండి
Follow Us