Smart Ration Cards : మీకు స్మార్డ్ రేషన్ కార్డు రాలేదా.. ఇలా చిటికెలో దరఖాస్తు చేసుకోండి!

 కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆన్‌లైన్, మరోకటి  ఆఫ్‌లైన్. ఇటీవల కొత్తగా ప్రభుత్వం వాట్సాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. 

New Update
ration card

ఏపీలో స్మార్డ్ రేషన్ కార్డు(Smart Ration Cards) ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. పురపాలక శాఖమంత్రి నాదెండ్ల మనోహర్‌(nadendla-manohar) విజయవాడ వరలక్ష్మీనగర్‌లో స్మార్డ్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలాజీ సహాయంతో ఈ స్మార్డ్ రేషన్ కార్డులు తయారుచేశామని అన్నారు. ఇందులో క్యూఆర్ కోడ్ ఏర్పాటుచేశామని వెల్లడించారు. లబ్ధిదారులు రేషన్ తీసుకోగానే  కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందతుందన్నారు. ఈ రోజున 9జిల్లాల్లో ఇంటింటికీ రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నామన్న మంత్రి..  సెప్టెంబర్‌ 15లోపు  1.46 కోట్ల కుటుంబాలకు ఈ  స్మార్డ్ రేషన్ కార్డులను అందజేస్తామని స్పష్టం చేశారు.

కొత్తగా అడ్రస్ మార్చుకున్న వారికి కూడా కార్డులు అందిస్తామన్నారు. కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు, వారి రేషన్ వివరాలు, వారికి మంజూరైన సరుకుల సమాచారం వంటివి వెంటనే తెలుసుకోవచ్చు అని మంత్రి అన్నారు. పాత పేపర్ కార్డుల మాదిరిగా కాకుండా, ఈ కొత్త కార్డులు ప్లాస్టిక్‌తో తయారు చేయబడ్డాయని,  దీనివల్ల అవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని చెప్పుకొచ్చారు.  క్యూఆర్‌ కోడ్ ద్వారా రేషన్ పంపిణీలో అవకతవకలను అరికట్టవచ్చని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుందని,  ఒకే వ్యక్తి ఒకటికంటే ఎక్కువ కార్డులు కలిగి ఉండటం వంటి అక్రమాలను గుర్తించి, నియంత్రించవచ్చు.  

 కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆన్‌లైన్, మరోకటి  ఆఫ్‌లైన్. ఇటీవల కొత్తగా ప్రభుత్వం వాట్సాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. 

Also Read :  వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్.. నేడూ, రేపు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

1. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం:

మీసేవ పోర్టల్ లేదా ఏపీ సేవా పోర్టల్: మీసేవ లేదా ఏపీ సేవా పోర్టల్‌ ఓపెన్ చేయాలి.  కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు "New Registration" అనే అప్షన్  పై క్లిక్ చేసి, తమ వివరాలతో ఒక అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత, "Issue of Ration Card" లేదా "New Ration Card" ఆప్షన్‌ను ఎంచుకోవాలి.  అప్లికేషన్ ఫారంలో అడిగిన వివరాలు - కుటుంబ పెద్ద పేరు, వయసు, చిరునామా, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు (పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ) సరిగ్గా నింపాలి. అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తును సమర్పించిన తర్వాత, మీకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దీనిని సేవ్ చేసుకోవాలి. 

2. వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం:

మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన మిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా కూడా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా 95523 00009 అనే నంబర్‌ను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి ఆ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపించాలి. అప్పుడు మీకు అందుబాటులో ఉన్న సేవల జాబితా కనిపిస్తుంది. అందులో రేషన్ కార్డుకు సంబంధించిన సేవలను ఎంచుకోవాలి. ఆ తర్వాత సూచనల ప్రకారం అవసరమైన వివరాలు, పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

3. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం:

గ్రామ/వార్డు సచివాలయం: మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లాలి. అక్కడ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫారం తీసుకోవాలి. ఫారంలో అడిగిన వివరాలు సరిగ్గా నింపి, అవసరమైన పత్రాలను జతచేయాలి. నింపిన ఫారం, పత్రాలను సచివాలయంలోని సంబంధిత అధికారికి సమర్పించాలి. దరఖాస్తును సమర్పించిన తర్వాత, వారు మీకు ఒక రసీదు లేదా అప్లికేషన్ నంబర్‌ను ఇస్తారు.

Also Read :  పక్కా ప్లాన్.. కంటెయినర్ లో 225 ల్యాప్ టాప్ లు దొంగతనం

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు 

ఆధార్ కార్డు (కుటుంబంలోని అందరివి)
అడ్రస్ ప్రూఫ్
ఇన్ కం సర్టిఫికెట్ 
దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

దరఖాస్తు స్థితిని తెలుసుకోవడం ఎలా?

మీ దరఖాస్తు నంబర్ లేదా రిఫరెన్స్ నంబర్‌తో ఏపీ సేవా పోర్టల్ లేదా vswsonline.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు. దరఖాస్తును సమర్పించిన తర్వాత, గ్రామ లేదా వార్డు సచివాలయం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, అర్హత ఉన్నవారికి రేషన్ కార్డును మంజూరు చేస్తారు.  

Advertisment
తాజా కథనాలు