/rtv/media/media_files/2025/05/04/Xd2HTH5HuWkjhGzX8cwn.jpg)
Employee's antics at the tourism office
AP News: ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఉద్యోగి ఒకరు రాత్రిపూట తన కార్యాలయాన్నే బెడ్ రూమ్ గా మార్చాడు. సాయంత్రం పూట అందరూ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తే ఆయన మాత్రం ఓ మహిళను వెంట బెట్టుకుని ఆఫీసుకు వస్తాడు. తాళం తీసుకుని లోనికి వెళ్లి డోర్లు వేసుకుంటాడు. ఆ తర్వాత తన పని ముగించుకుని తిరిగి ఆమెను తీసుకుని వెళ్లిపోతాడు. ఇది గత కొంతకాలంగా ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి నిర్హాకం. విజయవాడ కలెక్టరేట్‌కు ఎదురుగా బందరురోడ్డు వెంబడి లైలా కాంప్లెక్స్ ఉంది. ఈ కాంప్లెక్స్ దిగువన ఏపీటీడీసీ విజయవాడ డివిజనల్ కార్యాలయం, కమర్షియల్ విభాగాలు ఉన్నాయి. ఈ భవనం మల్టీప్లెక్స్ కావటంతో బయట పెద్దపెద్ద గేట్లు ఉంటాయి. సెక్యూరిటీ కూడా ఉంటుంది.
Also Read:కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
Employee's Antics At The Tourism Office
కానీ ఆవేమీ ఆయన రాసలీలలకు అడ్డుకాదనుకున్నాడు. అక్కడున్న సెక్యూరిటీకి నయానో,భయానో ఏదో ఒకటి చెప్పి కార్యాలయం తాళాలు తీసుకుని దర్జాగా మహిళను తీసుకువెళ్లి తన పని కానిచ్చేస్తున్నాడు.ఇప్పుడు ఈ వ్యవహారం సదరు డిపార్టుమెంట్‌లో కలకలం రేపింది. డ్యూటీ సమయం అయిపోయిన తర్వాత మళ్లీ రావడం, అదీ మహిళను వెంటతీసుకెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఉన్నతాధికారులకు సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో సదరు ఉద్యోగి బాగోతం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసి ఉన్నతాధికారులు ముక్కునవేలేసుకున్నారు. ఆటగాడు..మాములు ఆటగాడు కాదని తేలడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పై అధికారులకు తెలియకుండా టూరిజం కార్యాలయం తాళాలు తీయడం, మహిళతో కలిసి కార్యాలయంలోకి వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. దీంతో సదరు ఉద్యోగి చేసిన పని ఇప్పుడు ఆ శాఖలోనే కలకలం రేపింది.
విజయవాడ:
— RTV (@RTVnewsnetwork) May 4, 2025
టూరిజం డివిజనల్ ఆఫీస్‌లో ఉద్యోగి వెంకటేశ్వర్లు నిర్వాకం..
కార్యాలయం మూసివేశాక మహిళతో ఎంట్రీ...
సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదుతో వెలుగులోకి బాగోతం...
వెంకటేశ్వర్లు తో పాటు ఉన్న మహిళ కూడా టూరిజం జిల్లా కార్యాలయంలో ఉద్యోగినీగా గుర్తింపు...
ఉన్నతాధికారులకు తెలియకుండా… https://t.co/pfxzHunFZkpic.twitter.com/XtHs9F2dOc
అసలు టూరిజం డివిజన్ కార్యాలయంలో కార్యకలాపాలు ముగిశాక అసలు ఏం జరుగుతుందనే చర్చ విస్తృతంగా వినిపిస్తోంది. అసలేం జరుగుతుందో తెలుసుకోవటానికి అధికారులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. దీంతో సదరు ఉద్యోగి అడ్డంగా దొరికిపోయారు. రోజూ రాత్రి 7-8 గంటల మధ్యలో తన బైకుపై ఓ మహిళను తీసుకురావటం సీసీ కెమెరాల్లో రికార్డైంది. బైక్ పార్కు చేసి ఆమెను లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కార్యాలయం తాళం తెరిచి, ఆ మహిళను లోపలికి తీసుకెళ్లి తిరిగి తలుపులు వేయడం, అరగంట తర్వాత బయటకు వచ్చి బైక్‌పై వెళ్లిన ఆధారాలను సీసీ ఫుటేజీ ద్వారా సేకరించారు.
అయితే ఆ ఉద్యోగి కామక్రీడలు ఇంతకుముందు కూడా జరిగాయని తెలుస్తోంద. హరిత బెర్మ్‌పార్క్‌లోని స్టాఫ్ రూమ్‌లో కూడా చాలాకాలం ఈయన కార్యకలాపాలు సాగించారు. పార్క్‌లో వాకింగ్ చేయటానికి వచ్చిన మహిళను తరచూ స్టాఫ్‌రూమ్‌లోకి తీసుకెళ్లేవాడని. సిబ్బందిని బయటకు పంపేసి రాసలీలలు సాగించేవాడని తెలిసింద. దీంతో సిబ్బందే వలపన్ని సదరు సార్.. లీలలను బయట పెట్టారు. ఏసీ పైపుల రంధ్రానికి సీక్రెట్ కెమెరా పెట్టి మరీ ఈ విషయాన్ని సిబ్బందే వెలుగులోకి తెచ్చారు. ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా ఏకంగా డివిజనల్ కార్యాలయంలోనే ఇలాంటి పనులు చేస్తుండటంతో అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా, సదరు మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటో ఆయన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోవడంతో ఆయన రాసలీలలను ఆయనే బయట పెట్టుకున్నట్టు అయ్యింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది.
Also Read:మంచితనం నటిస్తారు.. ఇండస్ట్రీపై చిర్రెత్తిపోయిన హాట్ బ్యూటీ!
women | officer | AP Tourism latest updates | ap-tourism-development-corporation | AP Tourism