/rtv/media/media_files/2025/10/31/jangareddygudem-crime-news-2025-10-31-16-32-56.jpg)
Jangareddygudem Crime News
ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఓ మహిళపై అమానుష వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేవలం తన పెద్ద కొడుకుతో పిల్లలను కనాలని నిరాకరించినందుకు అత్తమామలు కలిసి కోడలిని 13 రోజులుగా చీకటి గదిలో బంధించారు. వివరాల్లోకి వెళ్తే... జంగారెడ్డిగూడెంకు చెందిన రంజిత్ కుమార్‌తో మూడు సంవత్సరాల క్రితం అమృత వల్లికి వివాహమైంది. వివాహమైన కొంతకాలం వరకు అంతా సవ్యంగా ఉన్నప్పటికీ.. గత కొద్ది రోజులుగా అమృత వల్లిని ఆమె అత్తమామలు నాగేశ్వరరావు, చంద్ర, తీవ్ర చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టారు.
పిల్లలు కనాలని కోడలిపై..
వారి వేధింపులకు ముఖ్య కారణం అత్యంత దారుణంగా ఉంది. తమ పెద్ద కొడుకైన ప్రవీణ్‌తో పిల్లలను కనాలని అత్తమామలు అమృత వల్లిపై ఒత్తిడి తెచ్చారు. అత్తమామల ఈ అమానుషమైన కోరికకు ఆమె భర్త రంజిత్ కుమార్ కూడా సహకరించినట్లు తెలుస్తోంది. ఈ వేధింపులను.. వారి అక్రమ డిమాండ్‌ను అమృత వల్లి తీవ్రంగా నిరాకరించడంతో.. ఆగ్రహించిన అత్తమామలు ఆమెను మరింత దారుణంగా హింసించడం ప్రారంభించారు. నిరాకరించినందుకు గాను. ఏకంగా ఆమెను ఒక గదిలో 13 రోజులుగా బంధించారు. ఈ గదిలో కనీసం కరెంటు సౌకర్యం గానీ, తాగడానికి మంచి నీటి సౌకర్యం గానీ కల్పించకపోవడం వారి క్రూరత్వాన్ని తెలియజేస్తోంది.
ఇది కూడా చదవండి: బిగ్ ట్విస్ట్... తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కుట్ర కోణం
సమచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. గదికి వేసిన తాళాలను పగులగొట్టి.. చిత్రహింసలకు గురైన అమృత వల్లిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ అమానుష ఘటనకు కారణమైన అత్తమామలు నాగేశ్వరరావు, చంద్రలతోపాటు వారి పెద్ద కొడుకు (అమృత వల్లి బావ) ప్రవీణ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపట్టారు. భర్త రంజిత్ కుమార్ పాత్రపై కూడా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: అమలాపురంలో మిస్సింగ్ కేసు కలకలం..ఘోరమైన స్థితిలో డెడ్ బాడీ!
 Follow Us
 Follow Us