/rtv/media/media_files/2025/07/28/east-godavari-husband-kills-his-wife-over-domestic-dispute-2025-07-28-07-45-12.jpg)
east godavari husband kills his wife over domestic dispute
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యపై అనుమానంతో దారుణానికి ఒడిగట్టాడు. పిల్లలు చూస్తుండగానే బండరాయితో తలపై కొట్టి కొట్టి చంపాడు. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చూడండి: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
అనుమానంతో చంపేశాడు
రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరుకు చెందిన ఉషారాణి(45)కి పదేళ్ల క్రితం నర్సీపట్నం మండలం గిడుగుటూరుకు చెందిన వేమగిరి మాణిక్యంతో మ్యారేజ్ అయింది. అనంతరం భార్య భర్తలిద్దరూ కొంతమూరు వచ్చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో తొమ్మిదేళ్ల కుమారుడు నిహంత్, ఏడేళ్ల కుమార్తె నిస్సి ఉన్నారు. భర్త మాణిక్యం వెల్డింగ్ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఇది కూడా చూడండి: పెళ్లికి ముందు HIV టెస్టు తప్పనిసరి.. మంత్రి సంచలన ప్రకటన
ఈ క్రమంలో భార్యపై అనుమానం పెరిగింది. దీంతో ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. భర్త వేధింపులకు తీవ్ర మనస్తాపం చెందిన భార్య ఉషారాణి రాజానగరం పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఇక అప్పటి నుంచి అతడు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఇంటికెళ్లి మరోసారి భార్యతో గొడవపడ్డాడు. పక్కనే పిల్లలు ఉన్నా ఆగలేదు.
ఇది కూడా చూడండి: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
ఈ గొడవలో తీవ్ర కోపానికి గురైన భర్త మాణిక్యం పక్కనే ఉన్న నాపరాయి (గుండ్రని రాయి) తీసుకుని భర్త ఉషారాణి తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. వెంటనే పిల్లలు పక్క వీధిలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికెళ్లి జరిగింది చెప్పారు. వాళ్లు వచ్చేసరికి ఉషారాణి అపాస్మారక స్థితిలో పడి ఉండటంతో.. ఆమెను రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి:సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం
Latest crime news | AP Crime | crime news