/rtv/media/media_files/2025/05/04/IpkTyRTw8Wdv7lpgq3Wt.jpg)
Devotees Fight In Tirumala Darshan
Tirumala : తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. అయితే దర్శనానికి చాలా సమయం పడుతుండడంతో భక్తుల్లో అసహనం పెరుగుతోంది. ఒకేసారి క్యూలైన్లకు భక్తులను వదలడంతో ఒకరినొకరు తోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయం ముందు క్యూ లైన్ లో భక్తులు ఒకరినొకరు కొట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: తిరుపతిలో విషాదం.. దామల చెరువులో వ్యాపారి దారుణ హత్య
నిన్న సాయంత్రం క్యూలైన్లో చిన్న పిల్లలతో వస్తున్న మహిళల ను తోటి భక్తులు తోసి వేశారన్న కారణంగా ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. దీంతో అక్కడే ఉన్న అక్కడే ఉన్న విజిలెన్స్, పోలీస్ సిబ్బంది వారిని అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా భక్తులు వినకుండా ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణ భక్తులకి ఎంత సర్ది చెప్పినా వినకుండా గొడవకు దిగడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. వెంటనే క్యూలైన్ వద్దకి చేరుకున్న విజిలెన్స్ అధికారులు భక్తుల్ని పక్కకు తీసుకెళ్లి సముదాయించి గొడవ సద్దుమణిగేలా చేశారు.
Also Read: భారత్-పాక్ ఉద్రిక్తత.. క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్
15 గంటల సమయం
శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్య గమనిక జారీ చేసింది. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని స్పష్టం చేసింది. అది ఎటువంటి టోకెన్లు లేకుండా ఆల్రెడీ క్యూలైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్‌లో వెయిట్ చేస్తున్న వారికి 10 గంటలు సమయం పడుతోందని వెల్లడించింది. ప్రస్తుతం కొత్తగా క్యూలైన్‌లోకి వెళ్లే వారికి 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది. భక్తుల రద్దీని బట్టి సమయాలు మారుతాయని పేర్కొంది.
శనివారం తిరుమల శ్రీవారిని 84 వేల 113 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,868 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.12 కోట్లు వచ్చింది. మొత్తం 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్లిన భక్తులకు సుమారు 15 గంటల సమయం పట్టింది. సమయం, స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు స్వామివారి సర్వదర్శనం 4 నుండి 6 గంటల పట్టింది. రూ. 300 ప్రత్యేక దర్శనం సుమారు 3 నుండి 4 గంటలు పట్టినట్లు టీటీడీ వెల్లడించింది.
Also Read: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!
Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?