Jaipur: పెట్రోల్‌ బంక్‌ లో భారీ అగ్ని ప్రమాదం..ఐదుగురి మృతి!

జైపూర్‌ అజ్మీర్ రోడ్‌లో భంక్రోటా ప్రాంతం పెట్రోల్ బంక్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనం కాగా.. మరో 12 మందికి పైగా గాయపడినట్టు సమాచారం.

New Update
jaipur

Jaipur: రాజస్థాన్‌ రాష్ట్ర రాజధాని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్‌లోని భంక్రోటా ప్రాంతంలోని పెట్రోల్ బంక్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాద జరిగింది. పెట్రోల్ బంక్‌ వద్ద ఆపి ఉంచిన సీఎన్‌జీ ట్యాంకర్‌ని పెట్రోల్‌ కోసం వచ్చిన మరో ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం నెలకొంది.

Also Read: Supreme Court: చట్టాలున్నది మొగుళ్లను బెదిరించడానికి కాదు

క్షణాల్లోనే మంటలు ట్యాంకర్‌ నుంచి పక్కనే ఉన్న వాహనాలకు వ్యాప్తి చెండదంతో పలు వాహనాలు మంటల్లో కాలిబుడిదయ్యాయి. 

Also Read: TTD: తిరుమలలో నిబంధనల ఉల్లంఘన.. మాజీ మంత్రిపై టీటీడీ కేసు నమోదు!

ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనం కాగా.. మరో 12 మందికి పైగా గాయపడినట్టు సమాచారం. అగ్ని ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి 22 ఫైర్‌ ఇంజిన్లు చేరుకున్నాయి. భారీగా చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల తీవ్రంగా నల్లటి పొగలు కమ్ముకున్నాయి. దీంతో, పక్కనే ఉన్న రహదారిపై భారీగా ట్రాఫిక్‌ ఆగిపోయింది.

Also Read: Telangana: తెలంగాణలో భారీ వర్షాలు..వాతావరణశాఖ కీలక ప్రకటన

ఇక, దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ గా మారుతున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సవాయ్ మాన్‌సింగ్ హస్పటల్ కి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. మరికాసేపట్లో ప్రమాద ఘటన ప్రదేశానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కూడా రాబోతున్నట్లు అధికారులు తెలిపారు. 

Also Read: AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!

Advertisment
తాజా కథనాలు