TTD: తెలంగాణ మాజీ మంత్రిపై టీటీడీ చర్యలకు సిద్ధమవుతుందా?.. త్వరలోనే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా?.. అంటే అవును అనే అంటున్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు..ఈ మేరకు ఆయన ఈ విషయం గురించి ట్వీట్ చేశారు. తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా ఊరుకునేది లేదన్నారు. Also Read: Telangana: తెలంగాణలో భారీ వర్షాలు..వాతావరణశాఖ కీలక ప్రకటన తిరుమల పవిత్ర క్షేత్రమని.. ఇది రాజకీయ వేదిక కాదన్నారు. ఎవరూ రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే టీటీడీ పాలకమండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటివారైనా సరే ఊరుకోమన్నారు. Also Read: AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే! తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నామన్నారు. అయితే ఆయనపై కేసు నమోదు చేస్తారా?.. టీటీడీ నిబంధనల ప్రకారం ఏవైనా చర్యలు తీసుకుంటారా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. Aslo Read: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! తిరుమల శ్రీవారిని తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. తిరుమలలో వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం తర్వాత శ్రీనివాస్‌గౌడ్ టీటీడీ టార్గెట్‌గా చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపాయి. తిరుమలలో తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, భక్తులపై టీటీడీ చిన్నచూపు చూస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. Also Read: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు అలాగే తిరుమలలో తెలంగాణ నేతలు, ప్రజలను సమానంగా చూసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. దేవుడంటే అందరికీ దేవుడని.. ఇది మంచి పరిణామం కాదని.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తులు, నేతలతో పోలిస్తే.. తెలంగాణ ప్రజలు, నేతల విషయంలో వ్యత్యాసం కనిపిస్తోంది అన్నారు. దీంతో టీటీడీ ఛైర్మన్ స్పందించారు.