Supreme Court: ప్రభుత్వాలు అమల్లోకి తీసుకొచ్చిన కఠిన చట్టాలు మహిళల సంక్షేమం కోసమే కానీ.. భర్తలను శిక్షించడం, బెదిరించడం, దోపిడీ చేయడానికి కాదని సుప్రీం కోర్టు మండిపడింది. వివాహ వ్యవస్థను హిందువులు ఎంతో పవిత్రమైనదిగా, కుటుంబానికి బలమైన పునాదిగా భావిస్తారని, అది వ్యాపార సాధనం కాదని తేల్చి చెప్పింది. భార్యను చిత్రహింసలకు గురిచేశారని, వేధింపులకు పాల్పడుతున్నారని, అత్యాచారాలు జరిపారన్న ఆరోపణలను గంపగుత్తగా పేర్చి.. చట్టాల్లోని పలు సెక్షన్ల కింద భర్త, అతడి కుటుంబంపై కేసులు పెడుతున్నారని అంది. Also Read: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు ఈ మేరకు మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఓ దంపతుల విడాకుల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. తీవ్ర మనస్పర్థలతో వేర్వేరుగా ఉంటోన్న దంపతుల వైవాహిక బంధాన్ని రద్దు చేసిన ధర్మాసనం.. భార్యకు శాశ్వత భరణం కింద రూ.12 కోట్లను నెల రోజుల్లోగా చెల్లించాలని భర్తను ఆదేశించింది. Also Read: TTD: తిరుమలలో నిబంధనల ఉల్లంఘన.. మాజీ మంత్రిపై టీటీడీ కేసు నమోదు! ఇదే సమయంలో అతడిపై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టివేసింది. భార్య తరఫున బేరసారాలు సాగించడానికి భర్త, ఆయన కుటుంబం తీవ్రమైన ఆరోపణలు చేయటం ప్రస్తుతం ఇప్పుడు ఫ్యాషన్ మాదిరి తయారైందని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. Also Read: Telangana: తెలంగాణలో భారీ వర్షాలు..వాతావరణశాఖ కీలక ప్రకటన ఈ డిమాండ్లలో ఎక్కువగా ఆర్థికపరమైనవే ఉంటున్నాయని ధర్మాసనం పేర్కొంది. గృహహింస చట్టం కింద ఫిర్యాదులపై కేసులు నమోదుచేసి రంగంలోకి ఎంటర్ అవుతున్న పోలీసులు కూడా.. భర్త తరుఫున కుటుంబంలోని వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారిని కూడా చూడకుండా అరెస్టు చేసి బెయిల్ రాకుండా చేస్తున్నట్లు ఆరోపించింది. ఇవన్నీ గొలుసుకట్టు మాదిరిగా ఉంటాయని వ్యాఖ్యానించింది. తన భర్తకు వేల కోట్లు ఆస్తులున్నాయని, మొదటి భార్య నుంచి విడాకుల తీసుకున్నప్పుడు అమెరికాలో ఓ విలాసవంతమైన భవనం సహా రూ.500 కోట్లను భరణంగా ఇచ్చారు. Also Read: AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే! కాబట్టి తనకు అంతే స్థాయిలో చెల్లించాలన్న మహిళ వాదనలను ధర్మాసనం తిరస్కరించింది. ఫ్యామిలీ కోర్టు నిర్ణయించిన రూ.12 కోట్ల భరణాన్ని సమర్దించింది. ఒకవేళ, విడాకులు తీసుకున్న తర్వాత ఆయన వ్యాపారంలో నష్టపోయి దివాలా తీస్తే మీరు వచ్చి ఆ కష్టాల్లో ఏమైనా ఆదుకుంటారా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.""అహం, కీర్తి వంటి అంశాలతో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి.. సయోధ్య లేదా కలిసి ఉండటానికి అవకాశం లేనంతగా సంబంధాలు దెబ్బతింటాయి"" అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ""భరణం నిర్ణయం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.. ఇందులో ఏకపక్ష విధానం ఉండకూడదు.. పరస్పర అంగీకారం ద్వారా వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లో కోర్టు చెప్పినట్టు భరణం చెల్లించడానికి ఒప్పుకున్నారు"" అని పేర్కొంది.