/rtv/media/media_files/2025/10/30/cyclone-montha-2025-10-30-20-29-00.jpg)
Cyclone Montha
మొంథా తుపాను(cyclone montha) రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. కుండపోత వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు మెరుపులు ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. కాగా భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా పలు జిల్లాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. కరెంట్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ స్తంభించింది.
Also Read : మోకాలి లోతు బురదలో తిరుగుతూ.. రైతులకు పవన్ భరోసా-PHOTOS
వరద నీటిలో కొట్టుకుపోయిన నలుగురు యువకులు
ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎన్నో పశువులు వరద నీటికి కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల వరద నీటిలో ప్రజలు కొట్టుకుపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అలాంటిదే తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్(Viral Video) గా మారింది. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలోని ప్రధాన రోడ్లపై ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు ఉప్పోంగింది. దీంతో సమీప ప్రాంతాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అనకాపల్లి జిల్లా..
— RTV (@RTVnewsnetwork) October 30, 2025
బుచ్చయ్యపేట: రోడ్లపై వరద నీరు.. కొట్టుకుపోయిన యువకులు
వరద నీరు రోడ్లపై ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గురువారం ఉదయం నుంచి రాజాం వద్ద ఆర్టీ రోడ్డులో వరద నీరు మోకాళ్లు లోతులో ప్రవహించింది.
రాజాంలో మరిడిమాంబ పండగ కావడంతో… pic.twitter.com/wf0OJF6I63
Also Read : మంత్రి నారా లోకేష్ పేరుతో భారీ మోసం..రూ. 54.34 లక్షలు కాజేసి..
ముఖ్యంగా రోడ్డు దాటేందుకు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇందులో భాగంగానే ఓ నలుగురు యువకులు రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండగా.. దాటేందుకు ప్రయత్నించి కొట్టుకుపోయారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్‌గా మారింది.
అసలు ఏం జరిగిందంటే.. వైరల్ అవుతున్న వీడియోలో.. బుచ్చయ్యపేటలోని ప్రధాన రోడ్డుపై ఫుల్‌గా వాటర్ ప్రవహిస్తు్ంది. దీంతో నలుగు యువకులలో.. ఒక యువకుడు పల్సర్ బైక్‌పై కూర్చోగా.. మిగతా ముగ్గురు అతడితో కలిసి ఆ ప్రవాహాన్ని లెక్కచేయకుండా రోడ్డును దాటేందుకు ప్రయత్నించారు. అయితే ఒక్కసారిగా నీటి ఉద్ధృతికి ఆ నలుగురు తమ పట్టును కోల్పోయారు. దీంతో ప్రవాహం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారంతా బైక్‌తో పాటు వరద నీటిలో కొట్టుకుపోయారు.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపత్తు సమయాల్లో ప్రభుత్వం, అధికారులు ఎన్నో హెచ్చరికలు జారీ చేస్తున్నారని.. కానీ యువకులు వాటిని పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారని మండిపడుతున్నారు. మరికొందరు ఇలాంటి సాహసాలు సినిమాల్లో హీరోలకు మాత్రమే సెట్ అవుతాయని.. నిజ జీవితంలో కాదంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.
Follow Us