Cyber Fraud Using Lokesh Name: మంత్రి నారా లోకేష్‌ పేరుతో భారీ మోసం..రూ. 54.34 లక్షలు కాజేసి..

డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం ఎంత పెరిగిందో..అంతే స్థాయిలో సైబర్ క్రైమ్స్ కూడా విస్తరిస్తున్నాయి. తాజాగా ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పేరు, ఫొటోను వాడి భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

New Update
565160409_1386549246167907_4595310871744670961_n

Cyber Fraud Using Lokesh Name

Cyber Fraud Using Lokesh Name:  డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, మొబైల్ యాప్‌లు, సోషల్ మీడియా వాడకం ఎంత పెరిగిందో.. అంతే స్థాయిలో సైబర్ క్రైమ్స్ కూడా విస్తరిస్తున్నాయి. హ్యాకింగ్, ఫిషింగ్, ఆన్‌లైన్ మోసాలు, రాన్సమ్‌వేర్ దాడులు సర్వసాధారణమైపోయాయి. ఈ క్రమంలోనే సైబర్‌ నేరగాళ్లు మరో మోసానికి తెగబడ్డారు. ఈ సారి ఏకంగా మంత్రి పేరుతో లక్షలు కాజేశారు. ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పేరు, ఫొటోను దుర్వినియోగం చేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వాట్సాప్‌లో లోకేష్ పేరు, ఫొటోను DPగా పెట్టి, బాధితులను బెదిరిస్తూ వారి ఖాతాల్లో భారీ మొత్తంలో డబ్బును జమ చేయించుకున్నారు. మొత్తం రూ. 54 లక్షలు ఈ ముఠా కాజేసినట్లు విచారణలో గుర్తించారు.

హెల్ప్ @ లోకేష్, హెల్ప్@ NCBN, హెల్ప్@ పవన్ కళ్యాణ్ వంటి..హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టి వైద్య పరీక్షల కోసం ఆర్థిక సాయం చేస్తామని నిందితులు ట్రాప్ చేస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ డీపీతో టీడీపీ NRI కన్వీనర్ అంటూ బాధితులకు రాజేష్ అనే వ్యక్తి ఎర వేశాడు. అయితే నిందితులు ముందుగా మంత్రికి సన్నిహితులను, పార్టీ నాయకులను టార్గెట్ చేశారు. ముందుగా మంత్రి లోకేష్ పేరు, ఫొటోలను ఉపయోగించి ఒక ఫేక్ వాట్సాప్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత మంత్రి లోకేష్ పేరుతో అత్యవసరంగా నిధులు కావాలని చెప్పి బాధితులను భారీ మొత్తంలో మోసగించారు. నిందితుడు పుట్టపర్తికి చెందిన రాజేష్ గతంలో కూడా ఎన్నారై టీడీపీ పేరుతో మోసాలకు పాల్పడినట్లు విచారణలో తెలింది. కాగా, వైద్య సాయం పేరుతో ఇప్పటివరకు సుమారు రూ.50 లక్షలకు పైగా వసూళ్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. 

నిందితులు నకిలీ క్రెడిట్ రసీదులు పంపి సాయం చేస్తున్నట్లు నమ్మించారు. డబ్బుల జమ కోసం 4% ఛార్జెస్ కట్టాలంటూ వసూళ్లు చేశారు.-- ఇలా ముగ్గురు సైబర్ నేరగాళ్లు రూ.54.34 లక్షలు వసూలు చేశారు. A1గా కొండూరి రాజేష్, A2గా గుత్తికొండ సాయి శ్రీనాథ్.. A3గా చిత్తడి తల సుమంత్‌లను గుర్తించి సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడు రాజేష్‌ను ముందు అరెస్ట్‌ చేసిన సీఐడీ అధికారులు అతన్ని విచారించారు. అతడు ఇచ్చిన వివరాలతో మిగిలిన నిందితుల వివరాలు సీఐడీకి చిక్కాయి. అయితే తాజాగా హైదరాబాద్‌లో సుమంత్, సాయిశ్రీనాథ్ అనే మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.  సైబర్ నేరాలపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి  పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు. అనుమానాస్పద వాట్పాస్ సందేశాలు నమ్మి డబ్బులు పంపితే భారీ నష్టాలు తప్పవని హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు