TG NEWS: అయ్యో బిడ్డలు.. బడి నుంచి రాగానే తల్లిని అలా చూసి! గుండెపగిలే ఘటన!

ఉదయం తల్లికి సంతోషంగా టాటా చెప్పి బడికి వెళ్లిన పిల్లల జీవితం సాయంత్రానికి చీకటిగా మారింది. పిల్లలు బడి నుంచి వచ్చేసరికి తల్లి విగత జీవిగా పడింది. ఇది చూసిన పిల్లలు అమ్మా.. అమ్మా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా అంటూ గుండెలవిసేలా ఏడ్చారు.

New Update
Sircilla

Sircilla

TG NEWS: ఉదయం తల్లికి సంతోషంగా టాటా చెప్పి బడికి వెళ్లిన పిల్లల జీవితం సాయంత్రానికి చీకటిగా మారింది. పిల్లలు బడి నుంచి వచ్చేసరికి తల్లి విగత జీవిగా పడింది. ఇది చూసిన పిల్లలు అమ్మా.. అమ్మా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా అంటూ గుండెలవిసేలా ఏడ్చారు. ఈ హృదయవిదారక ఘటన  సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో రమ్య అనే మహిళ తన ముగ్గురు పిల్లతో జీవిస్తుంది. భర్త బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లగా .. తానూ ఊళ్ళోనే ఉంటూ పిల్లలను చూసుకుంటుంది.

ఇంట్లోనే ఉరేసుకొని

అయితే రోజూలాగే మంగళవారం కూడా పిల్లను రెడీ చేసి బడికి పంపించింది. ఆ తర్వాత అత్తతో చిన్న గొడవ జరగడంతో మనస్థాపం చెందిన రమ్య ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్కూల్ కి వెళ్లిన పిల్లలు బడి నుంచి తిరిగి వచ్చేసరికి తల్లి మృతదేహంగా కనిపించడంతో అల్లాడిపోయారు. అమ్మా.. అమ్మా ఒక్కసారి లేవు అంటూ గుక్కపెట్టి ఏడ్చారు. ఆ ముగ్గురు చిన్నారులు ఆవేదన చూసి గ్రామస్తులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. గొడవలు జరుగుతాయి.. మళ్ళీ కలిసిపోతారు.. ఇన్ని రోజులు భరించుకొని ఉండి.. ఇప్పుడిలా చేసుకుంటే  ఆ పసివాళ్లను ఎవరు చూసుకుంటారు? వాళ్ళ పరిస్థితి ఏంటి అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లి కోసం పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్న దృశ్యాలు నెటిజన్లను కూడా కంటతడి పెట్టిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Advertisment
తాజా కథనాలు