Coolie Movie: కూలీ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 అదనంగా వసూలు చేసుకోవచ్చు.

New Update
Coolie in AP

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా నటించిన కూలీ సినిమా(Coolie Cinema) కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 అదనంగా వసూలు చేసుకోవచ్చు. ఈ ధరల్లో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది. ఆగస్ట్ 14న సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలీ.. రుతిక్ రోషన్ హీరోగా, జూనియర్ ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటిస్తున్న వార్-2 సినిమాలు విడుదల అవుతున్నాయి. 

Also Read :  భాగ్య శ్రీ ఫుల్ బిజీ.. టాలీవుడ్, కోలీవుడ్ ముద్దుగుమ్మ హవా!

Coolie Movie Ticket Prices Increase

పెరిగిన ఈ ధరలు సినిమా విడుదలైన రోజు నుంచి (ఆగస్టు 14, 2025) 10 రోజుల పాటు అంటే ఆగస్టు 23 వరకు అమల్లో ఉంటాయి. టికెట్ ధరల పెంపుతో పాటు, సినిమా విడుదల రోజున అదనంగా ఒక షో ప్రదర్శించుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ వంటి తారాగణం, అనిరుద్ రవిచందర్ సంగీతంతో కూలీ  బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది.

భారీ బడ్జెట్‌ మూవీస్ కూలీ, వార్‌2 ల టికెట్స్ బుకింగ్స్‌ ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఓపెన్‌ కాగా,  టికెట్స్ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టికెట్‌ బుకింగ్స్‌ ఎప్పుడెప్పుడు ఓపెన్‌ అవుతాయా? అన్న అభిమానుల ఎదురు చూపులకు తెరపడింది. మంగళవారం సాయంత్రం నుంచి టికెట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. బుక్‌మై షో, డిస్ట్రిక్ట్‌ యాప్‌లలో బుకింగ్స్‌ ప్రారంభమైయ్యాయి. 

Also Read :  వంగా మామూలుగా లేదు.. 'స్పిరిట్' ఫస్ట్ షెడ్యూల్ అక్కడ ప్లానింగ్!

తెలంగాణలో టికెట్‌ ధరల పెంపు లేదు. సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.175కు, మల్టీప్లెక్స్‌లలో రూ.295కే టికెట్లు లభిస్తున్నాయి. మార్నింగ్‌ షో కన్నా ముందు కేవలం ఓ షోకు మాత్రమే అనుమతి లభించినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా థియేటర్‌లకు అనుమతి ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ స్పెషల్‌ షోను ప్రదర్శించనున్నారు. 

హైదరాబాద్ మల్టీఫ్లెక్స్‌లో కూలీ సినిమా టికెట్ రేటు రూ.453గాగా, అటు వార్ 2(War 2) సినిమాలకు టికెట్ ధరలకు కూడా తెలంగాణ ప్రభుత్వం హైక్ ఇచ్చింది. 
andhra-pradesh-government | ticket-prices | rajinikanths-coolie-movie | coolie movie updates
Advertisment
తాజా కథనాలు