CM Chandrababu: సీఎం చంద్రబాబు విజయనగరం పర్యటన రద్దయింది. విజయనగరం స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన కారణంగా ఈరోజు ఆయన పర్యటన రద్దయింది. సీఎం పర్యటన రద్దయినట్లు మంత్రి కొండపల్లి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కాగా ఈరోజు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎంఓ సీఎం పర్యటన షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: పొంగులేటికి షాక్ ఇచ్చిన సీనియర్లు.. ఆ అంశాలపై హైకమాండ్ కు ఫిర్యాదు!
సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్...
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి సీఎం రేవంత్ మాస్ కౌంటర్!
నిన్న శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ప్రతి ఏడాది మూడు సిలిండర్ల పథకాన్ని ఆయన నిన్న ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా వాస్తవానికి ఈరోజు ఆయన విజయనగరం జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మావోయిస్టుల హెచ్చరిక!
* ఉదయం 11.15 గంటలకు హెలికాప్టర్‌లో చింతలగోరువానిపాలెంలోని లారస్ సంస్థ వద్దకు ఆయన చేరుకుంటారు. అక్కడ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
* మధ్యాహ్నం 12.20 గంటలకు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలేనికి చేరుకుంటారు సీఎం. రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొంటారు.
* అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు హెలికాప్టర్‌లో రుషికొండ వెళ్లి ఏపీ టూరిజం రిసార్ట్స్‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: ఇంట్లోకి దూరి మహిళను రేప్ చేసిన కాంగ్రెస్ నేత!