బిగ్ బాస్ ఫేమ్ ప్రేరణ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ కి బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో తెలుసా బిగ్ బాస్ సీజన్ 8లో ఎంట్రీ ఇచ్చిన సీరియల్ నటి ప్రేరణ.. తన ఆట, మాటతో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా దూసుకెళ్తోంది. అయితే ప్రేరణ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ కి బెస్ట్ ఫ్రెండ్ అనే విషయం మీకు తెలుసా..? ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలియాలంటే పూర్తి ఆర్టికల్ చదవండి. By Archana 02 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 కన్నడ నటి ప్రేరణ కంభం సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటగా కన్నడ సీరియల్స్ తో కెరీర్ స్టార్ చేసిన ప్రేరణ.. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. Image Credits: prerana.kambam/Instagram 2/7 ప్రేరణ 2017 లో 'హరహర మహాదేవ్' అనే కన్నడ సీరియల్తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన అద్భుతమైన నటనతో రంగనాయకి వంటి సూపర్ హిట్ సీరియల్లో అవకాశం దక్కించుకుంది. Image Credits: prerana.kambam/Instagram 3/7 2022 లో 'కృష్ణా ముకుందా మురారి' సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రేరణ.. కృష పాత్రలో తన నటన, అభినయంతో ఆకట్టుకుంది. తెలుగు ఆడియన్స్ ఫేవరేట్ బుల్లితెర నటిగా ముద్ర వేసుకుంది. Image Credits: prerana.kambam/Instagram 4/7 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ తో తెలుగులో బాగా పాపులరైన ప్రేరణకు బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది. సీజన్ 8 లో ఎంట్రీ ఇచ్చిన ప్రేరణ తన ఆట, మాట తీరుతో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా దూసుకెళ్తోంది. Image Credits: prerana.kambam/Instagram 5/7 అయితే ప్రేరణ సీజన్ 8లో అడుగుపెట్టేముందు స్టేజ్ పై ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నేషనల్ క్రష్ రష్మిక, తాను బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయాన్ని చెప్పింది. రష్మిక, ప్రేరణ కాలేజ్ ఫ్రెండ్స్ అట... మరి ఈ విషయం మీకు తెలుసా? Image Credits: prerana.kambam/Instagram 6/7 ప్రేరణ 2023లో శ్రీపాద్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో న్నడ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వివాహనంతరం కూడా ప్రేరణ సీరియల్స్ లో నటిస్తోంది. Image Credits: prerana.kambam/Instagram 7/7 సీరియల్స్ మాత్రమే కాదు కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో కూడా మెరిసింది ఈ నటి. కన్నడలో ఆనా, పెంటగాన్, ఫిజిక్స్ టీచర్, చూరికట్టె వంటి సినిమాల్లో నటించింది. Image Credits: prerana.kambam/Instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి