MLA Gaddam Vinod: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మావోయిస్టుల హెచ్చరిక!

TG: బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. బెల్లంపల్లిలో జరుగుతున్న కబ్జాలకు, దందాలకు గడ్డం వినోద్‌, ఆయన పీఏ ప్రసాద్ కారణమని.. వెంటనే మానుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు చూడాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.

New Update
ED Raids: గడ్డం వినోద్, మాజీ క్రికెటర్ల ఇళ్లలో ఈడీ సోదాలు..

MLA Gaddam Vinod: తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మావోయిస్టులు వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను మావోయిస్టులు హెచ్చరించారు. బెల్లంపల్లిలో జరుగుతున్న కబ్జాలకు, గొడవలకు, దందాలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, ఆయన పీఏ ప్రసాద్ కారణమని మావోయిస్టులు హెచ్చరిక జారీ చేసిన లేఖలో పేర్కొన్నారు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్‌లో కబ్జాలకు మరిగిన కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరి దందా చేస్తున్నారని అన్నారు. మావోయిస్టు పార్టీ కోల్‌బెల్ట్ ఏరియా కమిటీ ప్రభాస్ పేరుతో ఈ లేఖ విడుదల అయింది.

Also Read:అయ్యా.. మాకు న్యాయం చేయండి.. రంగనాథ్ కు ఆ బాధితుల వినతులు!

ఇటీవల బీఆర్ఎస్ నేతలకు... 

ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నేతలకు మావోయిస్టు పార్టీ వార్నింగ్ లెటర్ విడుదల చేసింది. దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలారా ఖబద్దార్ అంటూ హెచ్చరించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపణలు చేసింది. దళిత బంధు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూలు చేశారని మండిపడింది. అమాయకుల నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రజలకు డబ్బు తిరిగి ఇవ్వకపోతే శిక్ష తప్పదని లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు.

Also Read:నిండా ముంచింది.. కాంగ్రెస్‌పై KTR గరం!

"జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పేరుతో అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి దళిత బంధు ఇప్పిస్తామని ఆశలు చూపి మొదటి విడత రెండో విడత అని లక్షల రూపాయలు తీసుకొని ప్రజలను మోసం చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న రాజకీయ బ్రోకర్స్ లారా ఖబర్దార్ ఇప్పటికైనా తమ పద్ధతులు మార్చుకుని తిరిగి ప్రజల దగ్గర తీసుకున్న రూపాయలు ఇవ్వాలని హెచ్చరిస్తున్నాం. " అని రాశారు.

Also Read:వైఎస్‌ ఫ్యామిలీ రెండు ముక్కలు.. వారందరి సపోర్ట్ జగన్ కే!

Advertisment
తాజా కథనాలు