AP Govt : రైతులకు గుడ్ న్యూస్.. ప్రతీ బస్తాకు రూ. 800 ..సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

ఏపీ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగం తగ్గించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

New Update
chandrababu

ఏపీ ప్రభుత్వం(AP Government) సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై అధికారులతో సీఎం చంద్రబాబు(chandrababu) సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగం తగ్గించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. యూరియా వినియోగం తగ్గించే  రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయిపోయింది. ఇందుకు సంబంధించి విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నారు. రైతులు ఎక్కువ ఎరువులు వాడుతున్నారని దాని వల్ల మిరపను చైనా నుంచి తిప్పి పంపారని తెలిపారు.

Also Read :  ఏపీ మెగా DSC 2025 తుది ఫలితాలు విడుదల

బస్తాకు రూ. 800 ప్రొత్సాహకం

కొన్ని యూరప్ దేశాలు(Europe Countries) కూడా మన ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయని సీఎం  పేర్కొన్నారు. మరోవైపు యూరియా వినియోగం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను  ఆదేశించారు. యూరియా వాడని రైతులకు బస్తాకు రూ. 800 ప్రొత్సాహకం అందిస్తామని చెప్పారు. పీఎం ప్రణామ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దామని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, అవసరమైతే డోర్ డెలివరీ చేద్దామని సీఎం చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా యూరియాపై వైసీపీ చేసే ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పార్టీ నేతలకు సైతం సీఎం సూచించారు. 

Also Read :  ఆర్టీసీ బస్సులో  తప్పని సిగపట్లు..  సీటు కోసం డిష్యూం డిష్యూం

Advertisment
తాజా కథనాలు