BIG BREAKING: ఏపీ మెగా DSC 2025 తుది ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ మోగా డీఎస్సీ‌ 2025 ఫైనల్ లిస్ట్ విడుదల చేశారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను వెల్లడించారు. 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. జూన్‌ 6 నుంచి జులై 2 వరకు రెండు విడతలుగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

ఆంధ్రప్రదేశ్ మోగా డీఎస్సీ‌ 2025 ఫైనల్ లిస్ట్ విడుదల చేశారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను వెల్లడించారు. 150 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేశామని ఆయన ట్వీట్ చేశారు. ఇక నుంచి ప్రతిఏటా మెగా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://apdsc.apcfss.in/SelectionList  లో మెగా DSC 2025 తుది ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఏప్రిల్‌ 20న 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.

3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. జూన్‌ 6 నుంచి జులై 2 వరకు రెండు విడతలుగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. జులై 5న ప్రాథమిక కీ విడుదల చేయగా.. ఆగస్టు 1న తుది కీ ఇచ్చారు. టెట్‌కు 20శాతం వెయిటేజీ ఇచ్చారు. ఏడు విడతలుగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశారు. తర్వాత ఉద్యోగానికి ఎంపికైన వారి ఫైనల్ లిస్ట్ సోమవారం రిలీజ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు