మోదీ వల్ల దేశం అభివృద్ధి వైపు వెళ్తోంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీ ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ప్రధాని శ్రమిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మోదీ వల్ల దేశం అభివృద్ధి వైపు వెళ్తోందని పేర్కొన్నారు.

New Update
Chandra babu Naidu

Chandra babu Naidu

 ప్రధాని మోదీ గురువారం ఏపీలోని విశాఖపట్నంకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడంటూ కొనియాడారు. ఎన్డీయే కూటమి 93 శాతం స్ట్రేక్‌ రేట్‌తో ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో తమ కాంబినేషన్ కొనసాగుతుందని తెలిపారు.  

Also Read: వైకుంఠ ద్వార దర్శనం.. భక్తులకు TTD చైర్మన్ అదిరిపోయే శుభవార్త!

'' పేదల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ప్రధాని మోదీ శ్రమిస్తున్నారు. దేశంలో అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాల అనేవి మోదీ నినాదాలు. భారత్‌ను బలమైన ఆర్థి దేశంగా తీర్చిదిద్దేందుకు మేకిన్ ఇండియాను తీసుకొచ్చారు. స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియాను తెచ్చారు. ముంబయి దేశానికి ఆర్థిక రాజధానిగా ఎలా ఉందో.. ఆంధ్రప్రదేశ్‌కు కూడా విశాఖపట్నం అలాంటి నగరమే. ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఎన్డీయేనే గెలుస్తుంది. 

Also Read: హైకోర్టులో ఊరట.. వైఎస్ జగన్‌ యూరప్‌ పర్యటనకు లైన్‌ క్లియర్‌!

ప్రధాని త్వరలో అమరావతికి కూడా రావాలని కోరుతున్నాను. నదులను అనుసంధానించడమే మా టార్గెట్. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అవసరం. మోదీ చేపట్టే కార్యక్రమాల వల్ల దేశం అభివృద్ధి వైపు వెళ్తోంది. 2047 నాటికి అభివృద్ధిలో ప్రపంచంలోనే మొదటి లేదా రెండో స్థానానికి చేరుకుంటాం. రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు చూశాం. కేంద్ర అండతో నిలదొక్కుకున్నాం. మేమ హామీ ఇచ్చి సూపర్ సిక్స్‌ పథకాలు అమలు చేసే బాధ్యత మాది. కేంద్ర ప్రభుత్వ  సహాకారంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. అలాగే రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా కూటమి ప్రభుత్వానిది.  మోదీ ఏ సమస్యను చెప్పినా కూడా వెంటనే అర్థం చేసుకుంటారు. ప్రస్తుతం భారత్‌కు సరైన సమయంలో సరైన ప్రధాని ఉన్నారని'' చంద్రబాబు నాయుడు అన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు