CM Chandrababu: ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు...మోడీ అంగీకరిస్తే ఇక వేడుకలే...

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ జీవం పోస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి పునర్నిర్మానం పనులను ప్రారంభించేందుకు ప్రదాని మోడీని ఆహ్వానించాలని ఏపీ సీం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.

New Update
AP CM Chandrababu Naidu To Invite PM Modi

AP CM Chandrababu Naidu To Invite PM Modi

CM Chandrababu: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఏపీ రాజధాని అమరావతి(Capital Amaravati)కి మళ్లీ జీవం పోస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రదాని మోడీ(PM Modi)ని ఆహ్వానించాలని ఏపీ సీం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ  సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మది నెలలు పూర్తయింది. దీంతో, పాలనా పరంగా నిర్ణయాలను వేగవంతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ సారి ఢిల్లీ పర్యటన కీలకంగా మారుతోంది. మోదీ తో భేటీ వేళ చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఈ మేరకు అంగీకారం తెలిపితే ఏపీకి కీలక మలుపు అయ్యే అవకాశం కనిపిస్తోంది.  

Also Read: ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?

చంద్రబాబు- ప్రధాని భేటీ...

రేపు మధ్నాహ్నం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఆ రాత్రి అక్కడ బస చేస్తారు19 ఉదయం ప్రధానితో భేటీ కానున్నారు. ఈ సారి కొత్త ప్రతిపాదనలతో ఢిల్లీకి వెళ్తున్నారు. ఇదే సమయంలో ప్రధానితో భేటీ వేళ అమరావతి పైన కీలక చర్చ జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతి పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కేంద్రం సైతం అమరావతి కి ఆర్ది కంగా తోడ్పాటు అందిస్తోంది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ 13 వేల కోట్ల రుణం మంజూరు కాగా, కేంద్రం రూ 1500 గ్రాంట్ గా ఆమోదించింది.  అమరావతిలో రాజధాని పనులు తిరిగి ప్రారంభానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో అమరావతికి ప్రధాని మోదీని ఈ పర్యటన లో చంద్రబాబు ఆహ్వానించనున్నారు.

ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?

 అమరావతి రాజ ధానికి 2015 అక్టోబర్ 21న ప్రధాని మోదీ శంకుస్థాపన చేసారు. ఆ తరువాత అమరావతి వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత మూడు రాజధా నుల అంశం తెర మీదకు తీసుకు రావటంతో అమరావతి పూర్తిగా నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి పనుల కోసం ముందుగా ఆర్దిక వనరుల సమీకరణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ప్రపంచ బ్యాంకు - ఏడీబీ నుంచి రూ 13 వేల కోట్ల మేర రుణం అమరావతికి మంజూరు అయింది. అదే విధంగా ఇతర ఆర్దిక సంస్థల నుంచి రుణాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న పనుల ప్రారంభానికి టెండర్లు ఆహ్వానించారు.

ఇది కూడా చూడండి: WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!

అమరావతికి ప్రధాని ప్రధానిని ఆహ్వానించటం ద్వారా అమరావతి పనులు తిరిగి ప్రారంభ వేడుకను ఘనంగా నిర్వహిం చేందుకు సిద్దం అవుతున్నారు. ఏప్రిల్ లో ఈ మేరకు వేడుకలా నిర్వహణ కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రధాని షెడ్యూల్ మేరకు ముహూర్త తేదీ ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే రాజధాని అమరావతి లో రూ రూ.64,721 కోట్ల ఖర్చుతో పనులు చేపడుతున్నారు. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకుతో పాటుగా హడ్కో రూ 11 వేల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. తాజాగా రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. 2028 నాటికి లక్ష్యంగా ప్రధాన నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది. ఇక, ప్రధాని రావటం ద్వారా అమరావతి వైపు దేశం మొత్తం ఇటు చూస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని పర్యటన పైన చంద్రబాబు సమావేశంలో ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!


 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు