Amaravati : రాజధాని అమరావతిలో నిర్మాణాలపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. వ్యాపార , విద్యా సంస్థలు, హోటళ్లు, కార్యాలయాల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రస్తుత పరిస్థితిపై చంద్రబాబు చర్చించారు. 

New Update
Chandrababu holds key review on construction in capital Amaravati

Chandrababu holds key review on construction in capital Amaravati

Amaravati : ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన  ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. రాజధానిలో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రస్తుత పరిస్థితిపై ఆయా సంస్థల అధినేతలు, ప్రతినిధులు, అధికారులతో చంద్రబాబు చర్చించారు. 

Also Read: మహారాష్ట్రలో ముదురుతున్న భాషా వివాదం.. హిందీ VS మరాఠీ

Chandrababu Review On Constructions In Amaravati

ఎవరు ఏ సమయంలో తమ నిర్మాణాలు మొదలు పెడతారు..ఎప్పటికి పూర్తి చేస్తారనే అంశంలో నేరుగా ఆయా సంస్థల యజమానులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇప్పటి వరకు రాజధానిలో 72 సంస్థలకు  సీఆర్డీయే 947 ఎకరాలు కేటాయించింది. స్థలాలు పొందిన వారిలో స్కూళ్లు, బ్యాంకులు, యూనివర్సిటీలు, హోటళ్లు, హెల్త్ కేర్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, మత సంస్థలు, ఐటీ, టెక్ పార్కులు తదితర నిర్మాణాలున్నాయి.

Also Read: ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. నుజ్జునుజ్జైన బస్సు

అనుమతుల విషయంలో ఎక్కడా జాప్యం ఉండదని...జాప్యం ఉంటే నేరుగా తనను సంప్రదించాలని చంద్రబాబు సూచించారు.రాజధానిలో స్థలాలు పొందిన వారు నిర్దేశించిన సమయంలో నిర్మాణాలు మొదలు పెట్టి పూర్తి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఏ సందర్భంలోనూ, ఏ కారణంతోనూ జాప్యాన్ని అంగీకరించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా సమావేశంలో పాల్గొన్న ఆయా సంస్థల ప్రతినిధులు తమ నిర్మాణాలపై కీలక ప్రకటన చేశాయి. 

Also Read : శంషాబాద్ లో చిన్నారి కిడ్నాప్..కల్లుతాగించి..

స్థలాలు పొందిన 3 సంస్థలు నెల రోజుల్ఓ నిర్మాణాలు ప్రారంభిస్తామని చెప్పాయి. రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని15 సంస్థలు, 5 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని 13 సంస్థలు, 6 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని17 సంస్థలు స్పష్టం చేశాయి. కాగా నిర్మాణాలపై ప్రభుత్వం ప్రతి కంపెనీ, సంస్థ ప్రతినిధుల నుంచి ప్రణాళిక తెలుసుకుని, స్పష్టమైన హామీ తీసుకుంటుంది.

Also Read: Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

amaravati capital city works | amaravati capital latest | amaravati capital works | amaravati development | ap cm chandrababu naidu | cm chandrababu about amaravati

Advertisment
Advertisment
తాజా కథనాలు