/rtv/media/media_files/2025/08/18/modi-2025-08-18-12-34-50.jpg)
BIG BREAKING: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి(YS Jagan) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ(pm modi) సూచన మేరకు ఆయన ఈ కాల్ చేశారు. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతివ్వాలని జగన్ ను రాజ్‌నాథ్ సింగ్ కోరారు. లోక్‌సభలో వైసీపీకి 4 ఎంపీలు, రాజ్యసభలో వైసీపీకి ఏడుగురు సభ్యులున్నారు. కాగా గతంలో ఎన్డీఏ సూచించిన రాజ్యంగబద్దమైన పదవులకు వైసీపీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జగన్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read: ChatGPT Plus, Pro Plans: చాట్‌జీపీటీ యూజర్స్ కు షాకింగ్ న్యూస్..
జగన్ కు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్
— Telugu360 (@Telugu360) August 18, 2025
ఉప రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కోసం బీజేపీ ప్రయత్నం... ఎన్డీయే కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని జగన్ ను కోరిన రాజ్ నాథ్ సింగ్.#YSJagan
ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ జూలై 21న ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేయడంతో, భారత ఎన్నికల సంఘం కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 9 పోలింగ్ జరగనుంది.అదే రోజున కౌంటిగ్ జరుగుతుంది. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) తన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్‌ను ప్రకటించింది. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు. ఆయన గతంలో కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. అలాగే, ఝార్ఖండ్, తెలంగాణ మరియు పుదుచ్చేరి గవర్నర్‌గా కూడా పనిచేశారు. ఆయనకు పాలన, రాజకీయాలపై మంచి పట్టు ఉండటంతో NDA ఆయన్ను ఎంపిక చేసింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవంగా చేయాలని తాము కోరుకుంటున్నామని, దీనికోసం ప్రతిపక్ష నాయకులతో కూడా చర్చిస్తామని నడ్డా తెలిపారు.
Also Read: Telangana Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ
NDA అభ్యర్థి ప్రకటన తర్వాత ప్రతిపక్ష 'ఇండియా' కూటమి ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. వారు ఉపరాష్ట్రపతి ఎన్నికల బలాబలాలను, ఇతర పార్టీల మద్దతును పరిశీలిస్తున్నారు. రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాలా లేదా తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలా అనే దానిపై ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో NDAకు పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ ఉంది. అందువల్ల, సీ.పీ. రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం దాదాపు ఖాయం. అయితే, ప్రతిపక్షాల నుంచి పోటీ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Crime: అయ్యో .. కూతురి అప్పగింతలు చేస్తూ.. ఆగిపోయిన తల్లి గుండె! పెళ్లి వేడుకలో విషాదం