/rtv/media/media_files/2025/08/18/chatgpt-plus-pro-plans-2025-08-18-11-53-39.jpg)
ChatGPT Plus Pro Plans
ChatGPT Plus, Pro Plans: ఇప్పుడు భారత్‌లో ChatGPT Plus, Pro ప్లాన్ల ధరలు పెరిగిపోయాయి. ఇప్పటివరకు అమెరికన్ డాలర్లలో చెల్లింపులు జరిపే విధంగా ఉన్నా, ఇప్పుడు OpenAI భారత వినియోగదారుల కోసం రూపాయలలోనే చెల్లించే సౌలభ్యం కల్పించింది. కానీ, ఇది సౌకర్యవంతంగా ఉన్నపటికీ, ధరలు సుమారు 14 శాతం పెరిగాయి.
కొత్త ధరలు ఇవే.. (ChatGPT Plus, Pro Plans New Prices)
గతంలో ChatGPT Plus ప్లాన్ ధర $20 (సుమారుగా ₹1,750) ఉండగా, Pro ప్లాన్ ధర $200 (సుమారుగా ₹17,500)గా ఉండేది. కానీ ఇప్పుడు భారత రూపాయల ప్రకారం, ChatGPT Plus ప్లాన్ ₹1,999, మరియు Pro ప్లాన్ ₹19,900గా ఫిక్స్ చేశారు.
ఈ ధరలు కూడా కేవలం Plus, Pro మాత్రమే కాకుండా, Team అలాగే Business ప్లాన్లపై కూడా వర్తిస్తాయి. అంటే ఇప్పటినుంచి భారత వినియోగదారులు మరింత ఖర్చుతో ఈ సేవలను వినియోగించాల్సి ఉంటుంది.
OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్ గత సంవత్సరం భారత్‌కి వచ్చినప్పుడు, చాలామంది స్టార్ట్‌అప్ కంపెనీలు, డెవలపర్లు, ChatGPT ధరలు ఎక్కువగా ఉండటమే ChatGPT విస్తృత వినియోగాన్ని అడ్డుకునే ప్రధాన కారణంగా పేర్కొన్నారు. అందుకే OpenAI సంస్థ చౌకగా ఉండే "Go Plan" పై కూడా పనిచేస్తుందని అప్పుడు వార్తలొచ్చాయి. అయితే ఇప్పటివరకు ఆ ప్లాన్‌ను ప్రకటించలేదు.
Also Read: ప్రపంచంలో మొదటిసారిగా పిల్లలు కనే రోబోలు.. ఎక్కడో తెలిస్తే షాక్!
ఇండియాలో ChatGPT కి మంచి ఆదరణ ఉన్నా, Perplexity AI, Google Gemini వంటి ఇతర AI టూల్స్ కొంతమేర ఉచిత సేవలు అందిస్తున్నాయి. ఉదాహరణకు, Airtel వినియోగదారులకు Perplexity AI ఒక సంవత్సరం Pro యాక్సెస్ ఉచితంగా ఇస్తోంది. అలాగే, Google Gemini AI ప్లాన్‌తో పాటు YouTube Premium, Cloud Storage వంటి అదనపు లాభాలు కూడా అందిస్తున్నారు.
Also Read:ISS యాత్ర తర్వాత తొలిసారి ఇండియాకు బయల్దేరిన శుభాన్షు శుక్లా
యాప్ విశ్లేషణ సంస్థ Appfigures ప్రకారం, ChatGPT యాప్ మే 2023లో ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా $2 బిలియన్‌కి పైగా ఆదాయం సంపాదించింది. ఇతర AI టూల్స్ Claude, Copilot, Grok లతో పోల్చితే, ChatGPT వాటి కంటే 30 రెట్లు ఎక్కువ ఆదాయం పొందింది.
2025లో ChatGPT మొబైల్ యాప్ దాదాపు $1.35 బిలియన్ ఆదాయాన్ని సంపాదించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 673 శాతం పెరిగింది. ఇప్పటికీ ఈ యాప్ నెలకు సగటున ₹193 మిలియన్ వసూలు చేస్తోంది.
ధరలు పెరిగినప్పటికీ, ChatGPTని ఉపయోగించే వారి సంఖ్య అస్సలు తగ్గడం లేదు. కానీ, ధరల పెంపు వల్ల కొంతమంది వినియోగదారులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. ఇతర AI టూళ్లను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో OpenAI తక్కువ ధరలో అందరికి అందుబాటులో ఉండే ప్యాకేజీలు కూడా విడుదల చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.