Srisailam : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..వారికి లడ్డూ ఫ్రీ

మహాశివరాత్రి వేడుకలకు దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా శైవ క్షేత్రాలు శివ కళ్యాణానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఈ క్రమంలోనే శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

New Update
Srisailam Mallikarjuna TempleSrisailam Mallikarjuna Temple

Srisailam Mallikarjuna Temple

  Mahashivratri : మహాశివరాత్రి వేడుకలకు దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా శైవ క్షేత్రాలు శివుని కళ్యాణానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఈ క్రమంలోనే శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలతో పాటు పొరుగు రాష్ర్టాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీశైలం దేవస్థానం అన్నిరకాల ఏర్పాట్లు చేస్తోంది. 

Also Read: టోల్‌గేట్ వద్ద దారుణం.. ఓ వ్యక్తిని 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు


అయితే ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. అదెంటంటే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఉచితంగా ఒక లడ్డూ అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి భక్తుడికి  శ్రీశైలం దేవస్థానం ఒక్కొ లడ్డూను అందించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రతి భక్తుడికి 50 గ్రాముల బరువుండే లడ్డూను ఉచితంగా అందిస్తారు. ఇందుకోసం మొత్తం 4 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు శ్రీశైలం సందర్శించే భక్తులకు ఉచితంగా లడ్డూలు అందజేస్తారు.

Also Read: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. శవాలతో రెండ్రోజులు ఉన్న వృద్ధురాలు

ఈ క్రమంలోనే లడ్డూ ప్రసాదాల తయారీ కోసం ఆలయ ప్రాంగణంలోని పోటులో లాంఛనంగా శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల కోసం మొత్తం 35 లక్షల లడ్డూలను తయారు చేయనున్నారు. రోజుకు 2 లక్షల నుంచి 4 లక్షల లడ్డూలు తయారు చేయనున్నారు. 50 గ్రాముల లడ్డూ మాత్రమే ఉచితంగా అందించనుండగా,100 గ్రాముల లడ్డూ రూ.20 చొప్పున కౌంటర్ల ద్వారా విక్రయిస్తారు. లడ్డూ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడానికి ప్రైవేట్ సత్రాల వద్ద కూడా లడ్డూ విక్రయాలు జరపాలని దేవస్థాన కమిటీ నిర్ణయించింది.

Also Read: రేయ్ ఎవర్రా మీరంతా..! బర్డ్‌ఫ్లూ భయమే లేదు: ఊరంతా చికెన్ పండగే!


ఇది ఇలా ఉండగానే బ్రహ్మోత్సవాలకు వచ్చే  భక్తుల ఆకలి తీర్చేందుకు అన్న ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అన్నపూర్ణ భవన్‌లోని రెండు హాల్లలో శివ భక్తులకు, సాధారణ భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మూడో హాలులో పోలీసులకు.. నాలుగు, ఐదు హాల్లలో కళాకారులు, వీఐపీలకు భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 వరకు అన్న ప్రసాదం పంపిణీ జరగనుంది. అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ అన్న ప్రసాదం అందజేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా శివమాలధారణ చేసుకున్న స్వాములు మాల విరమణకు తరలిరానుండంతో అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు