/rtv/media/media_files/2025/05/02/dsX5y3aEtRedHpUp4g2H.jpg)
Lover attacks woman with knife
AP Crime : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం జరిగింది. గత కొంతకాలంగా తనతో సహాజీవనం చేస్తున్న మహిళపై ప్రియుడు హత్యాయత్నం చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలి కుమారుడు చెప్పిన వివరాల ప్రకారం నందిగామకు చెందిన స్రవంతి అచ్చిపెద్ద నరసింహారావు(పెద్దబాబు) తో సహాజీవనం చేస్తోంది. అయితే ఇరువురి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్రవంతి ఇంటికి వచ్చిన పెద్దబాబు డబ్బుల విషయంలో ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
Also Read: Pahalgam Attack: పహల్గామ్ దాడి...భారత్ కు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ వార్నింగ్
ఆవేశంతో ఊగిపోయిన పెద్దబాబు కత్తి తీసుకుని స్రవంతిపై దాడిచేశాడు. ప్రశాంతి ఒంటిపై 20 వరకు కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా విషయం తెలుసుకున్న స్రవంతి కొడుకు ఆమెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. స్రవంతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది.
కాగా దాడిచేసిన నిందితుడు పెద్దబాబు నందిగామ మున్సిపల్ కౌన్సిలర్ భర్తగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: రోజూ గంట నడిస్తే ఎన్ని కిలోల బరువు తగ్గవచ్చు?
Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం
Follow Us