Jagan: మాజీ సీఎం జగన్‌కు కేంద్రం ఊహించని షాక్! AP: మాజీ సీఎం జగన్‌కు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ పరిమితం చేయాలనే ప్రతిపాదన, నిర్ణయం కూడా జగన్ ప్రభుత్వంలో తీసుకున్నవేనని కేంద్రం తేల్చిచెప్పింది. By V.J Reddy 25 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Jagan: మాజీ సీఎం జగన్‌కు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ పై అధికార కూటమి ప్రభుత్వం, వైసీపీ నడుమ జరుగుతున్న మాటల యుద్దానికి చెక్ పెట్టింది. ఈ అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంలో నీటి నిల్వను 41.15 మీటర్ల ఎత్తు వరకు పరిమితం చేయాలనే ప్రతిపాదన, నిర్ణయం గత వైసీపీ ప్రభుత్వం హయాంలోనే తీసుకున్నారని కేంద్రం స్పష్టం చేసింది. 2021లో పోలవరంలో నీటినిల్వ 45.72 మీటర్ల ఎత్తుకు కాకుండా, 41.15 మీటర్ల ఎత్తుకే తొలిదశ నీళ్లు నిలబెట్టడం అన్న ప్రతిపాదన మొదట జగన్ ప్రభుత్వమే తమ వద్దకు ప్రపోసల్ పంపినట్లు బాంబ్ పేల్చింది. ఇదే అంశంపై 2023లో కేంద్ర జల్‌శక్తి, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి ఫైనల్ డిసిషన్ తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద స.హ. కార్యకర్త ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నలకు పోలవరం అథారిటీ ఈ సమాదానాలు చెప్పింది. Also Read: ఝార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్.. ఎప్పుడంటే ? జగన్ ప్రభుత్వం కోరింది..! పోలవరం ప్రాజెక్ట్ నీటి నిల్వ ఎత్తును తగ్గించడంపై వైసీపీ, టీడీపీ నడుమ నడుస్తున్న మాటల యుద్దానికి అసలు విషయాలను బయట పెట్టి కేంద్ర జల్‌శక్తి ఎండ్ కార్డు వేసింది. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన కీలక అంశాలను మోనటరింగ్ కమిటీ గత ప్రభుత్వానికి కీలక విషయాలను వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో 2021 జులై 29న జరిగిన సమావేశంలో డ్యాంలో 41.15 మీటర్ల ఎత్తుకే తొలుత నీళ్లు నిలబెడతామని జగన్ సర్కార్ కు ప్రతిపాదించింది. ఈ భేటీలో పోలవరంలో నీళ్లు నిల్వ చేయడం, పునరావాసం ఏర్పాటు చేయడం అనే అంశాలను రెండు భాగాలుగా చేయాలని చర్చించారు. ప్రాజెక్టులో మొదట 41.15 మీటర్ల ఎత్తుకే నీళ్లు నిలబెట్టేలా, అంతవరకు మాత్రమే అవసరమైన పునరావాస పనులు చేస్తామని, నిర్వాసితులను తరలిస్తామంటూ ఈ సమావేశంలోనే చర్చించి నిర్ణయించారని అథారిటీ పేర్కొంది. అయితే పోలవరంలో నీటిపారుదల విభాగానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని ఆనాడు సీఎంగా ఉన్న జగన్ ను కోరింది. ఈ క్రమంలోనే కేంద్ర జల్‌శక్తి వద్దకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు అథారిటీ స్పష్టం చేసింది. Also Read: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి..ఈ జాగ్రత్తలు తప్పనిసరి మరి Also Read: Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు.. పంబ వరకూ క్యూలైన్! Also Read: Crime: వివాహిత అపహరణ..బంధీగా ఉంచి 14 రోజులుగా అత్యాచారం! #jagan #chandrababu #polavaram-project మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి