‘సీజ్‌ది షిప్‌‌’లో బిగ్ ట్విస్ట్.. పవన్‌ కళ్యాణ్‌కు కేంద్రం షాక్!

పవన్‌ కళ్యాణ్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. స్టెల్లా షిష్ సీజ్ కుదరదని కేంద్రం తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి, కాకినాడ కలెక్టర్‌కి ఎన్సీఎల్ లేఖ రావడంతో.. రేషన్ బియ్యం మినహా మిగిలిన రైస్ ఎగుమతి జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

New Update

ఇటీవల కాలంలో కాకినాడ పోర్టు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. గత నెల నవంబర్ 27న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పర్యటించారు. ఈ మేరకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న స్టెల్లా ఎల్ షిప్‌ను తనిఖీ చేసి దాన్ని సీజ్ చేయించారు. కేంద్రం నుంచి ఎలాంటి సమస్య వచ్చినా తాను చూసుకుంటానని.. సీజ్ ది షిప్ అంటూ పవన్ చెప్పుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారం మరింత ఉధృతమైంది. 

ఇది కూడా చూడండి: లెస్బియన్స్‌తో సహజీవనం చట్టబద్ధమే.. హైకోర్టు సంచలన తీర్పు

రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్న ఆ షిప్‌ను పోర్టు అధికారులు సీజ్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ బియ్యాన్ని పశ్చిమ ఆసియాకు తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఇన్ని రోజులుగా జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మరోవైపు పోర్ట్ అధికారుల కనుసన్నలోనే వందల కోట్ల విలువైన బియ్యాన్ని సముద్రం దాటించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఈ షిప్ రిలీజ్ అవుతుందా? లేదా అని అందరిలోనూ ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలో ఈ షిప్‌ విడుదలకి రంగం సిద్ధమైనట్లు తెలిసింది.    

ఇది కూడా చూడండి:  ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ

పవన్ కళ్యాణ్‌కు కేంద్రం షాక్

ఇదిలా ఉంటే స్టెల్లా షిప్ వ్యవహారం రోజుకో చర్చకు దారి తీస్తుంది. ఈ వ్యవహారంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు కేంద్రం షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న షిప్‌ను గుర్తించి సీజ్ ది షిప్ అని అప్పట్లో పవన్ అన్న వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు మాత్రం కేంద్రం షిప్ సీజ్ చేయడం కుదరదని చెప్పినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి:  బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు

షిప్‌ను ఆఫ్రికా పంపాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఆఫ్రికా దేశాల నుంచి బియ్యం లోడింగ్‌కు వచ్చిన స్టెల్లా షిప్ కాకినాడ పోర్టులోనే నెల రోజులుగా ఉండిపోయింది. ఇక షిప్ నెలరోజులుగా నిలిచిపోవడంతో బియ్యం ఎగుమతిదారులు తాజాగా అడ్మిరాలిటీ కోర్టును ఆశ్రయించారు. 

కాగా 28 మంది కలిసి నౌకను అద్దెకు తీసుకున్న ఎగుమతిదారుల్లో.. 15 మంది బియ్యం లోడింగ్ పూర్తి అయింది. ఈ క్రమంలోనే పవన్ ఎంట్రీతో మిగతా బియ్యం లోడింగ్ నిలిచిపోయింది. అందిన సమాచారం ప్రకారం.. కలెక్టర్ తనిఖీలతో పీడీఎస్ రైస్ బయటపడింది. దీంతో ఎగుమతి నిలిచిపోవడంతో ప్రభుత్వానికి, అలాగే కాకినాడ కలెక్టర్‌కి ఎన్సీఎల్ లేఖ రాశారు. 

ఇది కూడా చూడండి: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్

ఆఫ్రికాతో ఒప్పందాలకు ఇబ్బంది రాకూడదని ఎన్సీఎల్ లేఖ పేర్కొంది. ఈ మేరకు తనిఖీల పేరిట ఆటంకాలతో దేశానికి ఇబ్బందని పేర్కొన్నారు. ఆకలి నివారణ కోసం ఆఫ్రికాతో భారత్ జీటూజీ డీల్ కుదుర్చుకుందని ఆ లేఖలో ఉంది. దీంతో ఎన్సీఎల్ లేఖతో అధికారులు వెనక్కి తగ్గే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యం మినహా మిగిలిన బాయిల్డ్ రైస్, రా రైస్ ఎగుమతి జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు