Ambati Rambabu: నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌ బై...!

తన తల్లిని అవమానించిన వారిని ఊరికే వదిలిపెట్టాలా? అంటూ మంత్రి లోకేశ్‌ నిన్న మండలిలో అన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాజీ మంత్రి అంబటి తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌ బై చెబుతా అంటూ సవాల్‌ విసిరారు.

New Update

AP:

అసెంబ్లీలో తన తల్లి నారా భువనేశ్వరిని వైసీపీ సభ్యులు అవమానించారని ఐటీ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఆరోపించారు.  ఈ క్రమంలో మాజీ మంత్రి వైసీపీ సీనియర్‌ నేత అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చారు. అంతేకాకుండా నారా లోకేశ్‌ కు సవాల్‌ కూడా విసిరారు. శాసనసభలో మీ తల్లిని అవమానించినట్లు నిరూపిస్తే ! బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తాను అంటూ ఛాలెంజ్ చేశారు.

Also Read: AP Pensions: : ఏపీలో త్వరలో కొత్త పింఛన్లు...వారికి మాత్రం..!

మరి ఈ సవాల్ పై మంత్రి నారా లోకేశ్‌ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. గత వైసీపీ పాలనలో చంద్రబాబు నాయుడు ప్రతిరోజూ అసెంబ్లీకి వచ్చారని...నా తల్లిని అవమానించిన తర్వాతే బాయ్‌ కాట్‌ చేశారని లోకేష్‌ అన్నారు. వైసీపీ దుష్ప్రచారం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: Trump: ట్రంప్ సంచలన నిర్ణయం..భారత సంతతి హిందూ మహిళకు కీలక పదవి

2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పారిపోయారని వైసీపీ సభ్యులు అంటున్నారు.చంద్రబాబు హౌస్‌కువచ్చారు.అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని అవమానించారు. ఈరోజు కావాలని సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా అదే విధంగా పెడుతున్నారు. నా తల్లిని అవమానించారు ఆ రోజు...మీకు గుర్తులేవా ఇవన్నీ అంటూ మంత్రి లోకేశ్‌ వైసీపీ ఎమ్మెల్సీలపై మండిపడ్డారు.

Also Read: టేపుతో కట్టేసి.. క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి.. ఎముకలు విరగొట్టి.. వెలుగులోకి సంచలన నిజాలు!

ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలని అవమానిస్తారు. విజయలక్ష్మిని అవమానిస్తారు. నా తల్లిని అవమానిస్తారు. ఇవన్నీ గుర్తులేవా మీకు. నేను కూడా మాట్లాడవచ్చు. కానీ ఏనాడు మేం మాట్లాడలేదు. జగన్‌ కుటుంబం గురించి మేం ఏనాడూ మాట్లాడలేదు అని మంత్రి లోకేశ్‌ అన్నారు.

Also Read: Ap News: ఇదేం పద్ధతి.. మంత్రికి సభలోనే క్లాస్ పీకిన స్పీకర్ అయ్యన్న!

చంద్రబాబు గారు సింగిల్‌ గా నిలబడ్డారు సింహంల...గుర్తుపెట్టుకోంది. పోరాడారు. నా తల్లిని అవమానించారు కనుకే బాధ తట్టుకోలేక సభను బాయ్‌ కాట్‌ చేసి బయటకు వెళ్లారు మా ఎమ్మెల్యేలు ఉన్నారు అదీ మా చిత్తశుదద్ది అని నారా లోకేశ్‌ అన్నారు.

Advertisment
తాజా కథనాలు