Chandrababu Health : డేంజర్ లో చంద్రబాబు హెల్త్.. స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు కుట్ర..లోకేష్, భువనేశ్వరి సంచలన ప్రకటనలు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేశ్ సంచలన ప్రకటనలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదంలో ఉందన్నారు. బాబుకు స్టెరాయిడ్స్ ఇచ్చే కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందటూ భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా బరువు తగ్గినట్లయితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్పారని భువనేశ్వరి తెలిపారు. అంతేకాదు జైలులో సౌకర్యాలు సరిగ్గా లేవని..ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని...జైల్లోని పరిస్థితులు తన భర్తకు తీవ్రముప్పు తలపెట్టేలా ఉన్నాయంటూ భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.