Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. హిందూ మహిళకు కీలక పదవి

నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌‌గా డొనాల్డ్ ట్రంప్ హిందూ అమెరికన్ లేడీ తులసి గబార్డ్‌ను ఎంపిక చేశారు. ఈమె అండర్‌‌లో మొత్తం 18 ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు పనిచేయనున్నాయి. తులసి తల్లి హిందూ కావడంతో ఈమె ఎక్కువగా హిందూ విలువలు పాటిస్తారు.

author-image
By Kusuma
New Update
Tulasi Gabbard

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్ట్ ట్రంప్ గెలిచిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా హిందూ అమెరికన్‌ను డొనాల్ట్ ట్రంప్ ఎంపిక చేశారు. మాజీ డెమొక్రాటిక్ కాంగ్రెస్ మహిళ, అమెరికా సైన్యంలో విధులు నిర్వర్తించిన తులసి గబార్డ్‌ను డొనాల్డ్ ట్రంప్ ఎన్నుకున్నారు.

ఇది కూడా చూడండి: మళ్లీ పెళ్లి చేసుకోనున్న జెఫ్ బెజోస్.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

ఈమె అండర్‌లో 18 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు..

అధ్యక్ష పదవికి ప్రమాణం స్వీకారం చేయకముందు నుంచే తన టీమ్‌ను సెట్ చేసుకుంటున్నారు. ఈమె కింద అమెరికాలోని 18 ఇంజెలిజెన్స్ ఏజెన్సీలు పనిచేస్తాయి. హిందూ భావాలు ఉన్న తులసిని నేషనల్ ఇంటెలిజెన్స్‌కి డైరెక్టర్‌గా ఎన్నుకోవడంతో ఈమె గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హిందువును ట్రంప్ ఎంపిక చేయడంతో సోషల్ మీడియాలో ఈమె గురించి చర్చ జరుగుతోంది. 

ఇది కూడా చూడండి:  మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్‌షిప్‌లో ముద్దులు, హగ్‌లు సహజమే

తులసి గబార్డ్ హిందువే. ఈమె తల్లి హిందువు కావడం వల్ల తులసి అనే పేరును పెట్టారు. అమెరికాలోని సమోవాలో జన్మించిన ఈమె తన 21 ఏళ్లలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. ఇతని తండ్రి మైక్ గబ్బార్డ్ రిపబ్లికన్ పార్టీ నుంచి డెమొక్రాటిక్ పార్టీకి మారారు. ఈ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందువుగా ఈమె ‌రికార్డు సృష్టించారు.

ఇది కూడా చూడండి:  Gold Price Today: మహిళలకు బంపరాఫర్.. భారీగా తగ్గిన పసిడి ధరలు

సభలో మొదటి హిందూ సభ్యురాలిగా, భగవద్గీతపై ప్రమాణం చేశారు. తులసి సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్‌ను వివాహం చేసుకుంది. ఆమె ఆర్మీలో దాదాపుగా 20 ఏళ్ల పాటు పనిచేశారు. ఇరాక్, కువైట్‌లో కూడా ఈమె పనిచేశారు. ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్‌ 3 సమయంలో ఈమె చేసిన సేవలకు వైద్య బాడ్జ్‌ గుర్తింపు లభించింది. అలాగే హౌస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కమిటీలో కూడా రెండేళ్లు పనిచేశారు. 

ఇది కూడా చూడండి: మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు విడుదల!

Advertisment
Advertisment
తాజా కథనాలు