/rtv/media/media_files/2025/02/12/XTaRhUt3EUuujWLh6H48.webp)
Auto
కూటమి ప్రభుత్వం ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం వాహనమిత్ర స్కీమ్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ స్కీమ్‌కి సంబంధించిన డబ్బులు నేడు ఆటో డ్రైవర్ల అకౌంట్‌లోకి పడనున్నాయి. ఈ స్కీమ్‌కు అర్హత ఉన్నవారి బ్యాంక్ అకౌంట్‌లో నేడు డబ్బులు పడనున్నాయి. నేడు 11 గంటలకు సీఎం చంద్రబాబు ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌తో కీలక నేతలు అంతా కూడా పాల్గొంటారు. మొదటిగా దసరా పండుగ సందర్భంగా లబ్ధిదారుల అకౌంట్‌లోకి డబ్బులు జమ చేయాలని భావించింది. కానీ ఆ తర్వాత తేదీని మార్చింది. అయితే సొంతంగా ఎవరికి అయితే ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ ఉంటుందో వారికి ఈ డబ్బులు లభిస్తాయి. ఈ స్కీమ్ కింద ఏడాదికి రూ.15 వేలు కూటమి ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఈ డబ్బులు కేవలం అర్హత ఉండి, జాబితాలో పేర్లు ఉన్నవారికి మాత్రమే. ఆ జాబితో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: Bomb Threat Mails: చంద్రబాబు, జగన్ నివాసాల్లో బాంబులు.. తిరుపతిలో కూడా.. సంచలన మెయిల్!
ఆటో డ్రైవర్లకు దసరా కానుకను ఇస్తోంది కూటమి ప్రభుత్వం. రేపు ఉదయం 11 గంటలకు 2,90,234 మంది ఆటో రిక్షా/ మాక్సి క్యాబ్/ మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.435.35 కోట్లు జమ చేయనుంది.#VemireddyPrabhakarReddy#VPR#NelloreMP#IdhiManchiPrabhutvam#Super6SuperHit#ChandrababuNaidu… pic.twitter.com/hJUERISsuC
— Vemireddy Prabhakar Reddy (@vpr_official_) October 3, 2025
ఇది కూడా చూడండి: 'పేదల సేవలో' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు-PHOTOS
ఫైనల్ జాబితాలో ఉంటేనే డబ్బులు..
వాహనమిత్ర స్కీమ్‌కు దరఖాస్తు చేసుకున్న వారు స్టేటస్ తెలుసుకోవాలంటే ముందుగా https://gsws-nbm.ap.gov.in/NBM/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో హోం పేజీలో స్కీమ్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు 2025-26 ఆప్షన్ సెలక్ట్ చేసుకుని ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చాను సెలక్ట్ చేసి.. గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఇలా చేశాక మీకు బేసిక్ డిటైయిల్స్ కనిపిస్తాయి. ఇందులో మీ పూర్తివివరాలు ఉంటాయి. ఇలా కాకుండా ఏమైనా రిమార్స్ కనిపిస్తే మాత్రం మీకు డబ్బులు రావు. అప్లికేషన్‌లో ఏదో ఇబ్బంది ఉన్నట్లే. వెంటనే మీరు అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలి. అప్పుడే అకౌంట్‌లోకి డబ్బులు జమ అవుతాయి.