ఆటోలో కేటీఆర్ | KTR In Auto Drivers on Maha Darna | RTV
ఆటోలో కేటీఆర్ | KTR In Auto Drivers on Maha Darna conducted at Hyderabad and many followers and fans of KTR including BRS Activists surround him to wish | RTV
ఆటోలో కేటీఆర్ | KTR In Auto Drivers on Maha Darna conducted at Hyderabad and many followers and fans of KTR including BRS Activists surround him to wish | RTV
ప్రజాభవన్ ముందు ఆటోకు నిప్పు పెట్టుకున్నాడు మహబూబ్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ దేవా(45). మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించండి ద్వారా ఆటో కిరాయిలు దొరకటం లేదని.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ఆటోడ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈరోజు ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులతో మంత్రి పొన్నం సమావేశం అయ్యారు. వారు ఎదురుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పటు చేస్తామని హామీ ఇచ్చారు. ఓలా, ఉబెర్ తరహాలో యాప్‌ను తీసుకొస్తామని అన్నారు.
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలవుతున్న వేళ.. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15 వేలు జీవన భృతి ఆదుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. అలాగే మారుమూల ప్రాంతాల్లో బస్సు సౌకర్యాలు పెంచాలని కోరారు.
ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటోడ్రైవర్లు దాడిచేసిన ఘటన కొత్తగూడెంలో జరిగింది. ఆటోల్లో వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికులు బస్ రావడంతో ఆటోనుంచి దిగేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన నలుగురు ఆటో డ్రైవర్లు బస్సు డ్రైవర్ కె.నాగరాజుపై దాడిచేశారు. బూతులు తిడుతూ కొట్టినట్లు నాగరాజు కంప్లైట్ చేశాడు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వారితో సమావేశమై వారు ఎదురుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్స్ సమస్యలపై అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.