/rtv/media/media_files/2025/05/26/6AeAnluk7bvpKcGF6zas.jpg)
AP Tenali police strong punishment to youth
AP News: ఏపీలో ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డుపై చితకబాదారు. గంజాయి మత్తులో తనపై దాడిచేశారనే కానిస్టేబుల్‌పై ఫిర్యాదుతో ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు లంచం అడిగితే ఇవ్వనందుకు తప్పుడు కేసు పెట్టి చావగొట్టారని బాధితులు చెబుతున్నారు.
Also Read: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
గుంటూరు జిల్లా తెనాలిలో కానిస్టేబుల్ పై దాడి చేసిన రౌడీషీటర్ అనుచరులకు అరికాలి కోటింగ్ ఇచ్చిన పోలీసులు.
— Sreekanth B+ve (@sreekanth324) May 26, 2025
నెల రోజులక్రితం ఐతానగర్ లో కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో దాడిచేసిన రౌడీషీటర్ లడ్డూ అనుచరులు .
కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన తెనాలి టూ టౌన్ పోలీసులు. pic.twitter.com/pJRfFVfqkT
Also Read: BIG BREAKING: సంచలన అప్‌డేట్.. పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ బాంబు దాడి !
దళితులు, మైనారిటీలే టార్గెట్
ఈ మేరకు దళితులు, మైనారిటీలే టార్గెట్ గా పోలీసులు దాడులు చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కన్నా చిరంజీవి 2 టౌన్‌లో కంప్లైంట్ ఇవ్వడానికి సంబంధం లేదని వాపోతున్నారు. అమాయక దళిత, మైనారిటీల యువకులపై తెనాలి ఐతానగర్ నడిరోడ్డులో అందరూ చూస్తుండగా పోలీసుల జులుం ప్రదర్శించారని మండిపడుతున్నారు. తెనాలి 2 టౌన్ రాముల నాయక్, 3 టౌన్ CI రమేష్ బాబుల దాష్టీకం ఏమిటని ఆవేదన చెందుతున్నారు.
లంచం ఇవ్వనందుకే దాడి..
ఈ మేరకు ఇటీవల కన్నా చిరంజీవి 2 టౌన్ పరిధిలోకి వచ్చి ఈ యువకులను ఏదో చిన్న విషయంలో లంచం ఇవ్వమని బెదిరించాడు. లేకపోతే అక్రమ కేసులు, గంజాయి కేసులు పెడతామని 3 టౌన్ CI రమేష్ బాబు చెప్పమన్నారని వారిని భయపెట్టాడు. వాళ్ళు డబ్బులు ఇవ్వమని తిరస్కరించగా అందుకు ఆక్రోశించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవి.. అతని అవినీతి బయటకు వస్తుందేమోనని ముందుగానే వెళ్లి యువకులపై అబద్ధపు కేసు పెట్టాడు. 2 టౌన్ కు సంబంధం లేని 3 టౌన్ కానిస్టేబుల్స్ బెదిరింపులకు గురిచేయడం దారుణం అంటున్నారు.
ఇది కూడా చూడండి: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
బాధితులు చెంచుపేటకు చెందిన చేబ్రోలు జాన్ విక్టర్ (25) దళితుడు, ఐతానగర్ కు చెందిన దోమా రాకేష్ (25) దళితుడు, తిప్పర్ల బజార్ కు చెందిన షేక్ బాబులాల్ (21) సంవత్సరాలు ముస్లిమ్. ఈ ముగ్గురిని రోజులు వారి వద్దే ఉంచుకుని చిత్రహింసలకు గురిచేశారు. వీధి వీదులు తిప్పుతూ తెనాలి, ఐతానగర్ ప్రధాన కూడళ్ళలో రోడ్డులపై కూర్చోబెట్టి బహిరంగ ప్రదేశాలలో ప్రజలు చూస్తుండంగా విచక్షణారహితంగా దాడిచేయడం అమానుషం. తెనాలి 2 టౌన్ CI రాములు నాయక్, 3 టౌన్ CI రమేష్ బాబులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను బాధిత బంధువులు కోరారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్‌డేట్.. పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ బాంబు దాడి !
నేరం చేస్తే న్యాయస్థానాలకు అప్పచెప్పాలి. కానీ ఇంత క్రూరంగా ప్రజలు చూస్తూ ఉండగా కొట్టాల్సిన అవసరం లేదు. గౌరవ న్యాయస్థానాలు ముద్దాయిలను ఈ విధంగా శిక్షించవద్దు. ఈ విధంగా కొట్టవద్దు. కొట్టే హక్కు మీకు లేదు అని చెప్పినా పెడచెవిన పెట్టి ఈ విధంగా ప్రజలపై తెనాలి పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ విషయం మీద తల్లిదండ్రులు వెళ్ళి మాట్లాడితే ఇంకా వారికి సంబంధించిన వ్యక్తులు వెళ్ళి మాట్లాడినా మీపైన కూడా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడా కనబడడం లేదని ప్రజాసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
police | boys | tenali | telugu-news | today telugu news