/rtv/media/media_files/2025/07/31/apsrtc-free-bus-scheme-ticket-2025-07-31-12-15-07.jpg)
APSRTC Free Bus Scheme Ticket
AP News: ఏపీ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ కల నెరవేరనుంది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ.. మహిళా లోకానికి పెను మార్పులు తీసుకురావడానికి సిద్ధమైంది. గుంటూరులో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, జోనల్ చైర్మన్ సురేష్‌రెడ్డి పాల్గొన్నారు. జోన్ 3 పరిధిలోని గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు.
మహిళలకు ఉచితం ప్రయాణం..
ఈ సందర్భంగా ఎండీ తిరుమలరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని నిరూపించుకోవడానికి ఆధార్ వంటి ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా బస్సులో చూపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు ఎండీ తెలిపారు. త్వరలో 1,050 కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయని.. ప్రతి ఏటా డీజిల్ బస్సుల స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టబడతాయని ఆయన ప్రకటించారు. రేపు విజయవాడలో ఆ తర్వాత వైజాగ్‌లో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: మా పాలమూరు ప్రాజెక్టుకు అడ్డొస్తే.. చంద్రబాబుకు సీఎం రేవంత్ స్ట్రెయిట్ వార్నింగ్!
ఆర్టీసీ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ప్రయాణించే అంశంపై త్వరలోనే మార్గదర్శకాలు రానున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బస్సులు, సిబ్బందితోనే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని.. ఈ సౌకర్యం కేవలం రాష్ట్ర మహిళలకు మాత్రమే ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ పథకం మహిళల ప్రయాణ భారాన్ని తగ్గించి.. వారికి ఆర్థికంగా గణనీయమైన ఊరటనిస్తుందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. APSRTC ప్రవేశ పెట్టిన ఈ ఉచిత ప్రయాణ పథకం ఏపీలోని ప్రతి మహిళలు వ్యక్తిగత భారం తగ్గుతుంది. ఈ ప్రయత్నం సామాజిక సమగ్రతను పెంచి, సామాన్యుల జీవన ప్రమాణాన్ని మెరుగుపరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ ఈ ఉచిత ప్రయాణం సేవను అందిస్తుంది. ఈ పథకం ద్వారా దినసరిగా నిర్దిష్ట రూట్లపై వారు బస్‌లో ఉచితంగా ప్రయాణించగలరు. ప్రయాణం కొరకు ప్రత్యేక టోకెన్లు లేదా ఆధార్ విశ్రాంతి కార్డులు వాడవలసి ఉంటుంది. ఈ సేవ పొందవలసిన వారు ఆధార్ ఆధారిత రిజిస్ట్రేషన్, వాలిడేషన్ ప్రక్రియలో పాల్గొనాలి.
ఇది కూడా చదవండి: జగన్ నెల్లూరు టూర్ లో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డిపై లాఠీ ఛార్జ్!
( AP News Latest | ap news today | rtc | Latest News | telugu-news )