AP Crime: కూతురు ప్రేమ వివాహం.. పెళ్లి చేసిన వ్యక్తిని చంపేందుకు భారీ సుపారి!

కూతురికి ప్రేమ విహహం జరిపించిన వ్యక్తిని చంపేందుకు లక్ష రూపాయల సుపారీ ఇచ్చిన ఘటన ఏపీ నందిగామలో చోటుచేసుకుంది. వీర్రాజు, రమ్యశ్రీల పెళ్లి చేసిన గోపిని హత్యచేసేందుకు రమ్య తండ్రి నరసింహారావు గ్యాంగు ఏర్పాటు చేశాడు. పోలీసులు ముందస్తు సమాచారంతో పట్టుకున్నారు. 

New Update
nandigama

AP Nandigama murder plan case

AP Crime: కూతురు ప్రేమ వివాహానికి సహకరించిన వ్యక్తిని హత మార్చేందుకు భారీ సుపారి ఇచ్చిన ఘటన ఏపీలో సంచలనం రేపుతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పెళ్లి చేసిన వ్యక్తిని కోడి కత్తులతో పొడిచి హత్య చేసేందుకు రెక్కీ చేస్తుండగా నిందితులు అనుకోకుండా పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో అసలు విషయం బయటపడగా వివరాలు ఇలా ఉన్నాయి. ఏ.కొడూరు మండలం కొండూరుకు చెందిన రమ్య శ్రీ అనే యువతి.. నందిగామ మండలం ఐతవరంకు చెందిన మొవ్వ వీర్రాజును ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వీర్రాజు, రమ్యశ్రీల ప్రేమ వివాహానికి వీర్రాజు సమీప బంధువు మొవ్వ గోపి సహకరించాడు. దీంతో గోపిపై కక్ష పెంచుకున్న రమ్యశ్రీ తండ్రి కోలా నరసింహారావు గోపిని హతమార్చేందుకు భారీ ప్లాన్ వేశాడు. 

సంక్రాంతికి మిస్ అయిందని..

ఇందులో భాగంగానే హైదరాబాద్ కు చెందిన పాలంపల్లి విజయ్ కుమార్ తో డీల్ కుదుర్చుకున్నాడు. విజయ్ కుమార్ కు లక్షరూపాయల సుపారీ ఇచ్చాడు. సంక్రాంతి పండుగ రోజు మొవ్వ గోపిని హత్యచేసేందుకు ఐతవరంలో రెక్కీ నిర్వాహించాడు విజయ్ కుమార్. గ్యాంగ్ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో ఫిబ్రవరి 2న మరోమారు రెక్కీ నిర్వహించాడు. గ్యాంగ్ నందిగామ మయరి టాకీస్ సెంటర్ లో అనుమానంగా సంచరిస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే విజయ్ కుమార్ తోపాటు ఆయన గ్యాంగ్ లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద కోడికత్తులు స్వాధీనం చేసుకున్నారు.


ఇది కూడా చదవండి:Rape case: ఛీ ఛీ వీడేం వార్డెన్‌రా బాబూ.. అబ్బాయిలను రూమ్‌కు తీసుకెళ్లి బట్టలిప్పి!

Advertisment
తాజా కథనాలు