Janasena: వైద్యురాలితో అసభ్య ప్రవర్తన.. తమ్మయ్య బాబును సస్పెండ్ చేసిన జనసేనాని!

ఏపీ పత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ వరుపుల తమ్మయ్య బాబును పార్టీ సస్పెండ్ చేసింది. ఉమెన్స్ డే రోజు మహిళ వైద్యురాలితో దురుసుగా ప్రవర్తించినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జనసేన పార్టీ వేములపాట అజయ్ దీనిపై అధికారిక లేక విడుదల చేశారు.

New Update
v babu

Sena party Varupula Tammaiya Babusu spended

Janasena: ఏపీ పత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ వరుపుల తమ్మయ్య బాబును పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఉమెన్స్ డే రోజు మహిళ వైద్యురాలితో దురుసుగా ప్రవర్తించినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జనసేన పార్టీ వేములపాట అజయ్ దీనిపై అధికారిక లేక విడుదల చేశారు. ప్రత్తిపాడు సిహెచ్‌సి ఘటనపై అందిన నివేదికలు, వివరణలు పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ప్రత్తిపాడు సిహెచ్‌సి వైద్యులు శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించి, దుర్భాషలాడిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు.

 

అసలేం జరిగిందంటే..

ఉమెన్స్ డే రోజను ప్రత్తిపాడు జనసేన ఇంఛార్జిగా ఉన్న వరుపుల తమ్మయ్య బాబు వీరంగం సృష్టించారు. ప్రత్తిపాడు పీహెచ్‌సీకి వెళ్లిన వరుపుల తమ్మయ్య బాబు మహిళా డాక్టర్, సిబ్బందితో దురుసుగా వ్యవహరించాడు. సీహెచ్‌సీ డాక్టర్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వైద్యం చేస్తుండగా.. బాధితుల వివరాలు తమ్మయ్య బాబుకు చెప్పాలంటూ జనసేన కార్యకర్తలు డాక్టర్‌కు ఫోన్ ఇచ్చేందుకు ట్రై చేశారు. 

Also Read: 17 ఏళ్లుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసిన యూపీ పోలీసులు!

దీంతో వైద్యం చేసేటప్పుడు ఫోన్ మాట్లాడనని ఆమె తిరస్కరించారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న తమ్మయ్యబాబు.. తాను ఫోన్ చేస్తే మాట్లాడవా అంటూ లేడీ డాక్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. నోర్ముయ్ అంటూలేడీ డాక్టర్‌తో పాటుగా అక్కడ ఉన్న వైద్య సిబ్బందితోనూ దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. దీనిపై పవన్ సీరియస్ అయినట్లు సమాచారం. 

Also Read: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీ‌షీటర్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు