NWR Railways Recruitment 2025 : 10వ తరగతితో రైల్వే ఉద్యోగాలు.. 898 ఖాళీలకు నోటిఫికేషన్

నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 898 ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2025 అక్టోబర్ 3 ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థలు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

New Update
indian

నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 898 ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2025 అక్టోబర్ 3 ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థలు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 2 చివరి తేదీ. నార్త్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో వివిధ వర్క్‌షాప్‌లు/యూనిట్లలో మొత్తం 898 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో వివిధ ట్రేడ్‌లకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి.

10వ తరగతి పాసై ఉండాలి

అభ్యర్థులు కనీసం 50% మార్కులతో 10వ తరగతి (మెట్రిక్యులేషన్) పాసై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ - NTC) పాస్ అయి ఉండాలి. అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.ముందుగా రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) జైపూర్ అధికారిక వెబ్‌సైట్ rrcjaipur.in ను సందర్శించాల్సి ఉంటుంది. హోమ్‌పేజీలో, "Apprentice (04/2025)" విభాగానికి వెళ్లి, "ONLINE / E-Application" లింక్‌పై క్లిక్ చేయాలి. 

మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి. మీకు రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అయిన తర్వాత, దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన అన్ని వ్యక్తిగత, విద్య, ఇతర వివరాలను సరిగ్గా నింపాలి. 10వ తరగతి మార్క్ షీట్, ఐటీఐ సర్టిఫికేట్, వయస్సు ధృవీకరణ పత్రం మొదలైన అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి. దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.  వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకున్న తర్వాత దరఖాస్తును సమర్పించి, భవిష్యత్తు అవసరాల కోసం దాని ప్రింట్‌అవుట్ తీసుకోండి. అభ్యర్థి వయస్సు 24 సంవత్సరాలు మించకూడదు.  10వ తరగతి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ITI) సర్టిఫికేట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

ఇండియన్ ఆర్మీలో 194 పోస్టులు

భారత సైన్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & మెకానికల్ ఇంజినీర్స్ (DG EME) విభాగంలో 194 గ్రూప్ 'C' సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 4 నుంచి 24వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్‌లిస్ట్, రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, PET, PST, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianarmy.nic.in/

Advertisment
తాజా కథనాలు