/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Vangalapudi-Anitha-.jpg)
AP Home Minister Anitha fire on ys Jagan
AP News: ఏపీ మాజీ సీఎం జగన్ పై హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన కామెంట్స్ చేశారు. పోలీసుల బట్టలూడదిస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన జగన్ శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో IPC సెక్షన్ ప్రకారం కాకుండా YCP సెక్షన్ ప్రకారం పోలీసులు పనిచేశారన్నారు. కానీ తమ ప్రభుత్వంలో చట్ట ప్రకారమే నడుచుకుంటారని చెప్పారు. జగను మాటలు వింటే.. ఇదంతా క్రిమినల్ లీడర్ ఫ్రీ ప్లాన్ అని, ఇలా కూడా ఆలోచన చేస్తారా అనిపించిందన్నారు. జగన్ మాట్లాడుతుంటే వారి 5 ఏళ్ల అరాచక పాలన గుర్తుకొచ్చిందన్నారు.
Also Read : మాములు దొంగ కాదు.. కొట్టేసిన నగలను ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు!
2800 పై చిలుకు హత్యలు..
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన జనాలు మర్చిపోలేదు. ముసుగులేసుకుని కస్టోడీయల్ టార్చర్ ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? ఇలాంటి సంస్కృతి మాది కాదు. ఇప్పటి సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, హోంమంత్రి అనేక కేసులు ఉన్నాయి. ఇవన్నీ ప్రశ్నించడంతో వల్ల పెట్టారు. ఊడదీయడానికి CMR షాప్ నుంచి కొని తెచ్చుకోవడంతో వచ్చింది కాదు పోలీసు యునిఫాం అన్నారు. వైసీపీ హయాంలో 2800 పై చిలుకు హత్యలు జరిగాయి. ఇలా ప్రవర్తిస్తేనే 151 నుంచి 11కి దిగిపోయావు నువ్వు. ఇకనైనా మారకపోతే అవి కూడా రావన్నారు.
ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
పెందుర్తి ట్రాఫిక్ అంశంపైనా పోలీసుల తప్పులేదు. జగన్ వెళ్లే ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం కావడంతో 1100 మంది పోలీసులను పెట్టాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏర్పాటు చేశాం. కానీ వాట్సాప్ లో రెచ్చగొట్టే మెసేజ్ పెట్టారు. కావాలని ఓ సీన్ క్రియేట్ చేయాలని చూసారు. ఓ క్రిమినల్ నాయకుడు ఉంటే ఎలా ఉంటుందో నిన్న తెలిసింది. హెలిపాడ్ దగ్గరకు తీసుకుంటూ, నెట్టుకుంటూ వచ్చారు. కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి. ఇంతచేసి పోలీసులను తప్పు పడుతున్నారు.
ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..
జగన్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే అదంతా చేశారుహెలికాప్టర్ దగ్గర జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. జగన్ వస్తున్నారనే సెక్యూరిటీ పటిష్టంగా ఉంచాం, జగన్ పర్యటనకు అడ్డు రాకూడదని ఎమ్మెల్యే పరిటాల సునీత స్వయంగా టీడీపీ కార్యకర్తలను ముందుగానే కోరారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. వైసీపీ కార్యకర్తల దాడిలో పోలీసులకు గాయాలయ్యాయి. మాజీ సీఎం కోసం 250 మంది పోలీసులు హెలిప్యాడ్ వద్ద ఉన్నారు. జగన్ హెలికాప్టర్ లో వెళ్లకుండా రోడ్డు మార్గంలో వెళ్లేందుకే హెలిప్యాడ్ దగ్గర గొడవ సృష్టించే ప్రయత్నం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం భద్రత దృష్ట్యా కేవలం ఒక సిగ్నల్ మాత్రమే నిలుపుతాం. జగన్ మానసిక స్థితిపై మాకు అనుమానంగా ఉందంటూ జగన్ పై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు.
Also Read : సంతాన బావి.. ఈ నీళ్లు తాగితే కవల పిల్లలు.. ఆ ఊరంతా వాళ్లే!
jagan | vanitha | police | telugu-news | today telugu news