Manipur: రగులుతున్న మణిపూర్...కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమీక్ష

మణిపూర్ మళ్ళీ అట్టుడుకుతోంది. అక్కడ గొడవలు చెలరేగాయి. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

author-image
By Manogna alamuru
New Update
Amith Sha: కేంద్రమంత్రికి కారు లేదంట..ఎన్నికల అఫిడవిట్‌లో అమిత్‌ షా ఆస్తుల వివరాలు

Central Home Minister: 

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మళ్లీ హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. రీసెంట్‌గా  సీఆర్‌పీఎఫ్‌ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మృతి చెందారు. అప్పుడే మైతేయి తెగకు చెందిన ఆరుగురు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో అక్కడ మళ్ళీ రచ్చ రచ్చ అయింది.  ఇప్పటికీ ఇంకా ఈ పరిస్థితులు చల్లారలేదు. అందుకే ఇప్పుడు మణిపుర్‌ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా  సమీక్ష నిర్వహించారు. ఈరోజు ఆయన ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీని కోసం మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించారు.

మణిపూర్‌‌లో నిరసనకారులు రగిలిపోతున్నారు. మణిపుర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌తోపాటు ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్ళపై  దాడులు చేశారు. ఇళ్లల్లోకి దూరి ఫర్నిచర్, వాహనాలు, ఇతర సామగ్రిని తగలబెట్టారని పోలీసులు చెప్పారు. వీరిని అదుపు చేయడానికి భద్రతా సిబ్బంది బాష్ప వాయువులు ప్రయోగించారు. ఇంఫాల్‌లో అధికారులు కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్‌ వెస్ట్, బిష్ణుపుర్, ఇంఫాల్‌ ఈస్ట్‌లో ఇంటర్నెట్‌ సేవలనూ నిలిపివేశారు.

Also Read: KIM: దక్షిణ కొరియాకు నరకం చూపిస్తున్న కిమ్

Advertisment
తాజా కథనాలు