/rtv/media/media_files/2025/06/04/AuUAkM2y4BXk5279xx9C.jpg)
Magunta Srinivasulu Reddy
AP News: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసి, అందరి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.
Also Read : 18 ఏళ్ల కల..18 గంటల్లోనే విషాదం.. తొక్కిసలాటకు ఐదు కారణాలు
సంబరాల్లో కూటమి ప్రభుత్వం..
ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం కొత్త దిశగా ప్రయాణిస్తోంది. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్రంలో అనేక రంగాల్లో అభివృద్ధి కనిపించిందని మాగుంట అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారి నిర్మాణం, విద్యుత్ సరఫరా, ఆరోగ్య సేవలు వంటి రంగాల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రజలకు సానుకూల ఫలితాలనిచ్చాయని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విజయం సాధించిందని మాగుంట వివరించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో విషాదం.. ఒకే గదిలో తల్లి, కుమారుడి మృతి
రైతులకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు డిజిటల్ సౌకర్యాలు, మహిళలకు ఆర్థిక సహాయం, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన వంటి హామీలు ఇప్పటికే అమలులో ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఓ ప్రణాళికా బద్ధంగా పనిచేసే నేతగా నిరూపించుకున్నారని, రాష్ట్రాన్ని తిరిగి సుస్థిర అభివృద్ధి బాటలో నడిపించగలిగిన వ్యక్తిగా ప్రజల నమ్మకాన్ని సంపాదించారని మాగుంట పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధించేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ కర్తవ్యమని చెప్పారు. కూటమి పాలన ప్రజాసేవకు మరో పేరుగా నిలుస్తోందని, అన్ని వర్గాల ప్రజల కోసం పని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. సూట్‌కేస్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం
Also Read : ఎంగేజ్మెంట్ చేసుకున్న కుల్దీప్.. ఆమె మరెవరో కాదు
( ap-news | AP News Latest | ap political | AP Political News | Latest News | telugu-news)
Follow Us