Pensions: గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే డబ్బు పంపిణీ!

AP: పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛన్ పంపిణీ చేయనుంది. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీన పింఛన్ పంపిణీ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

AP Pensions Hike : ఏపీలో నేటి నుంచే పెరిగిన పెన్షన్ల పంపిణీ.. ఎవరికి ఎంతంటే?
New Update

AP Pensions: చంద్రబాబు సర్కార్ పింఛన్ పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛన్ పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీన పింఛన్ పంపిణీ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో పెన్షన్ దారులు ఒక రోజు ముందే పింఛన్ అందుకోనున్నారు. కాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.3000 ఉన్న పింఛన్ ను రూ.4000లకు పెంచిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు

ఇంటి వద్దకే..!

చంద్రబాబు సర్కార్ పింఛన్ పంపిణీ విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తోంది. పింఛన్ దారులకు పింఛన్ డబ్బులు వేగంగా అందేలా చర్యలు చేపట్టింది. ఒకటో తేదీనే రోజే దాదాపు 90 శాతం పింఛన్ డబ్బు పంపిణీ జరిగేలా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్ట్రిక్ట్ ఆర్దర్స్ ఇచ్చారు. కాగా సీఎం కుర్చీలో కూర్చున్న చంద్రబాబు.. ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వలన ఆగిన రెండు నెలల పింఛన్ డబ్బులను ఒకేసారి అర్హులకు అందించారు. ఆ తరువాత నెల నుంచి పెంచిన పింఛన్ డబ్బులను పింఛన్ దారులకు అందించారు. సీఎం చంద్రబాబు అమలు చేసిన పింఛన్ పెంపు విధానంపై పింఛన్ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రతీ నెల ఒకటో తారీకు నాడు పింఛన్ పంపిణీ 90 శాతం జరిగేలా  అధికారులు కార్యచరణ చేపట్టారు. 

ఇది కూడా చదవండి: చంద్రబాబుకు చెక్.. జగన్ షాకింగ్ నిర్ణయం!

వాలంటీర్ వ్యవస్థ రద్దు?...

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ రద్దు అవుతుందని ప్రచారం జరగడంతో వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో పింఛన్ పంపిణీకి ఆటంకం కలుగుతుందని అంత భావిస్తున్నారు. ఎందుకంటే పింఛన్ దారులకు ఒకటో తేదీన పింఛన్ ఇచ్చేది వాలంటీర్లు కాబట్టి. ప్రభుత్వం పెట్టుకున్న 90 శాతం పింఛన్ పంపిణీకి వాలంటీర్ల సమ్మె అడ్డంకులా మారుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు కానీ.. ఏ ఇతర నేతలు కానీ అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. ఒకవైపు వాలంటీర్ల సమ్మె.. మరోవైపు పింఛన్ల పంపిణీ.. దీనిపై బాబు సర్కార్ ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి. 

Also Read: Russian Plane: విమానం ల్యాండ్‌ అవుతుండగా ఇంజిన్‌లో మంటలు.. చివరికీ

Also Read: IPL: ముగిసిన ఐపీఎల్ వేలం.. ఫ్రాంఛైజీలు ఎంత ఖర్చు పెట్టాయి అంటే..

#ap-pension #chandrababu #ap-government
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe